అవును ఆమె అఖిలప్రియ. చిన్న వయసులోనే మంత్రి అయిన లక్కీ లీడర్. తల్లీ తండ్రీ భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి ఇద్దరి కష్టం ఈ రోజు ఆమె రాజకీయం. అయితే వారు దశాబ్దాలుగా పాలిటిక్స్ లో ఉంటూ ఒక ఇమేజ్ ని సాధిస్తే అఖిలప్రియ తన తొందరపాటుతో దూకుడు చర్యలతో కేవలం అయిదేళ్ల షార్ట్ టైమ్ లోనే దాన్ని పోగొట్టుకున్నారు అని అంటున్నారు. ఇదిలా ఉంటే 2019 ఎన్నికల్లో ఆళ్లగడ్డ నుంచి పోటీ చేసి ఓటమిని మూటగట్టుకున్న అఖిలప్రియకు సొంత ఇలాకాలో వ్యతిరేకత ఉంది. అందునా సొంత కుటుంబం నుంచే పేచీలు ఉన్నాయి.
భూమా అన్నదమ్ముల బిడ్డలే ఇపుడు అఖిల రాజకీయానికి బ్రేకులు వేస్తున్నారు. ఈ నేపధ్యంలో తన పట్టుని నిరూపించుకునేందుకు అఖిలప్రియ దూకుడుగా వెళ్తూండడంతో కూడా ఆంతో పాటు పార్టీకి చెడ్డ పేరు వస్తోంది.
అఖిలప్రియ నీరు చెట్టు బిల్లులకు సంబంధించి వసూళ్ళు చేయిస్తున్నారు అని టీడీపీ కార్యకర్తలు చేసిన ఫిర్యాదుల పట్ల అధినేత చంద్రబాబు సీరియస్ అయ్యారని వార్తలు వచ్చాయి. ఇక మరో విషయంలో చూస్తే ఈ మధ్యనే ఓ వ్యక్తిని చితకబాది రూ.1.35 కోట్ల రూపాయలను గుంజేయడం మీద కూడా బాబు మందలించారు అని చెబుతున్నారు.
మొత్తానికి తేలింది ఏమిటి అంటే ఆళ్ళగడ్డలో మునుపటిలా అఖిలప్రియకు రాజకీయ బలం లేదని అధినాయకత్వం గుర్తించిందిట.
అలాగే తరచూ వివాదాలతో ఆమె కూరుకుపోవడాన్ని కూడా గమనించి ఆమెను సైడ్ చేస్తున్నారు అని అంటున్నారు. దాంతో వరసబెట్టి నియోజకవర్గాల స్థాయిలో సమీక్షలు పెడుతున్న చంద్రబాబు అందరికీ జాగ్రత్తగా పనిచేసుకోండి అని టికెట్ విషయంలో భరోసా ఇస్తున్నారు. కానీ అఖిలప్రియకు మాత్రం ఆ ప్రామిస్ అయితే ఈ రోజుకీ లేదుట.
అంటే ఆళ్ళగడ్డ విషయంలో చంద్రబాబు వేరేవిధంగా ఆలోచనలు చేస్తున్నారా అన్న చర్చ సాగుతోంది అంటున్నారు. నిజానికి రాయలసీమలో చాలామంది నేతలకు బాబు టికెట్లు కన్ ఫర్మ్ చేశారు. మైదుకూరులో పుట్టా సుధాకర్ యాదవ్, రాజంపేటలో బత్యాల, పుంగనూరులో చల్లా రామచంద్రారెడ్డిలకు టికెట్లు ఖాయమన్న మాట పార్టీ ద్వారా తెలుస్తోంది. అదే టైమ్ లో ఆళ్ళగడ్డ విషయంలో మాత్రం బాబు తేల్చకపోవడంతో అఖిలమ్మ అనుచరులలో అనుమానాలు ఒక్కసారిగా పెరిగిపోతున్నాయట. మరి చంద్రబాబు చివరాఖరుదాకా చూసి వేరే వాళ్ళకు ఈ టికెట్ ఇస్తారా అన్న డౌట్లు అయితే ఉన్నాయి.