`మీరు నాకు చెప్పండి.. నేను మీడియాతో చెబుతా!`- కాంగ్రెస్‌పై ట్రోల్స్‌

Update: 2022-10-26 09:13 GMT
137 ఏళ్ల సుదీర్ఘ రాజ‌కీయ చ‌రిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి జాతీయ అధ్య‌క్షుడిగా.. నేడు.. క‌ర్ణాట‌క నాయ‌కుడు.. సీనియ‌ర్ నేత‌.. మ‌ల్లికార్జున ఖ‌ర్గే ప‌గ్గాలు చేప‌ట్ట‌నున్నారు. ఇటీవ‌ల జ‌రిగిన‌.. అంతర్గ‌త ఎన్నిక‌ల్లో ఆయ‌న విజ‌యంద‌క్కించుకున్న విష‌యంతెలిసిందే. అయితే..ఇప్పుడున్న ప‌రిస్థితిలో కాంగ్రెస్‌ను న‌డిపించ‌డం అంత తేలిక కాద‌నేది అంద‌రికీ తెలిసిందే. అంత‌ర్గ‌త ప్ర‌జాస్వామ్యం అదికంగా ఉన్న పార్టీలో.. నేత‌లంద‌రిదీ త‌లోదారి. ప్ర‌స్తుతం తెలంగాణ‌నే తీసుకుంటే.. అక్క‌డ జ‌రుగుతున్న మునుగోడు ఉప ఎన్నిక‌లో పార్టీ త‌ర‌ఫున అభ్య‌ర్థిని గెలిపించుకుని.. పార్టీ స‌త్తా తెలియ‌జేసే అవ‌కాశం ద‌క్కినా.. కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి వంటివారు.. తోక ఝాడిస్తున్నారు.

ఇక‌, ఏపీలో ఎన్నోప‌ద‌వులు అనుభ‌వించిన నాయ‌కులు.. ఉన్నా..పార్టీ కోసం.. ప‌నిచేస్తున్న‌వారు. ఒక‌రిద్ద‌రు మాత్ర‌మే క‌నిపిస్తున్నారు. ఈ నేప‌థ్యంలోపార్టీ ఎలా పుంజుకుంటుంద‌నేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌. ఇక‌, పొరుగు రాష్ట్రాల్లోనూ.. ఇంత‌కు మించిన ప‌రిణామాలు లేవు.

మ‌రోవైపు.. గాంధీల కుటుంబానికి అత్యంత విధేయుడిన‌ని.. చెప్పుకొనే మ‌ల్లికార్జున ఖ‌ర్గే.. ఇలాంటి వాటిని లైన్‌లో పెట్టాలంటే.. క‌ఠిన నిర్ణ‌యాలు తీసుకోవాల‌నేది సూచ‌న‌. కానీ, ఆయ‌న అలా చేసే ప‌రిస్థితి లేదు. ఎందుకంటే.. ఎన్నిక‌ల‌కు ముందే.. ఆయ‌న చెప్పేశారు. తాను గాంధీల విధేయుడిన‌ని.. వారు చెప్పిన‌ట్టు పార్టీని లైన్‌లో పెడ‌తాన‌ని.. అన్నారు.

నిజానికి గాంధీలు చెప్పింది.. జ‌ర‌గ‌డం లేదు కాబ‌ట్టి.. పార్టీలో ఎవ‌రూ..త‌మ మాట విన‌డంలేదు కాబ‌ట్టే ఇప్పుడు అధ్య‌క్షుడిని మార్చుకున్నాన‌రేది అక్ష‌ర స‌త్యం. కానీ, ఇప్పుడు మ‌ల్లికార్జున మాత్రం.. మీరు నాకు చెప్పండి.. నేను మీడియాకు చెబుతాను.. అన్న‌ట్టుగానే వ్య‌వ‌హ‌రిస్తున్నారు. రాబోయే రోజుల్లో కీల‌క‌మైన గుజ‌రాత్ స‌హా హిమాచ‌ల్ ప్ర‌దేశ్ ఎన్నిక‌లు ఉన్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకునే ప్ర‌ధాని మోడీ ఆయా రాష్ట్రాల్లో విజృంభిస్తున్నారు. కోట్ల‌కు కోట్లు కుమ్మ‌రిస్తున్నారు. సో.. ఆయ‌న‌ను ఎదుర్కొనాలంటే.. ఇంత‌కు మించిన వ్యూహాల‌తో ముందుకు సాగాలి. ఈ నేప‌థ్యంలో మ‌ల్లికార్జున త‌న సొంత బ్రెయిన్‌ను వాడాల‌నేది ప‌రిశీల‌కులు చెబుతున్న మాట‌.

కానీ, ఆత‌ర‌హా ప‌రిస్థితి మాత్రం మ‌ల్లికార్జునలో క‌నిపించ‌డం లేదు. మ‌రీ ముఖ్యంగా గ్రూప్ 23 నేత‌ల‌ను పార్టీలో లైన్‌లో పెట్టాలి. పార్టీ ప‌ని అయిపోయింద‌ని అనుకునే ప‌రిస్థితి నుంచి పుంజుకుంది.. అధికారంలోకి వ‌స్తుంద‌నే సంకేతాలు బ‌లంగా పంపించ‌గ‌ల‌గాలి.

అలా చేయ‌క‌పోతే.. అధ్య‌క్షుడిని మార్చి.. చేసే ప్ర‌య‌త్నం వ‌ల్ల‌..ప్ర‌యోజ‌నం లేదు. కేవ‌లం సీటులోకి కొత్త వ్య‌క్తి వ‌స్తారు కానీ.. కొత్త ఆలోచ‌న‌లు మాత్రం రాలేదు. మ‌రి ఈ ప‌రిస్థితిని క‌న్న‌డ నాయ‌కుడు ఎలా మారుస్తారో.. చూడాలి. ఇదిలావుంటే.. కాంగ్రెస్ ప‌గ్గాలు చేప‌డుతున్న ఖ‌ర్గేపై.. అప్పుడే.. ట్రోల్స్ వ‌స్తున్నాయి. మీరు చెప్పండి.. నేను చేస్తాను.. అని స‌ర్ అంటారేమో.. అనినెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News