తెలంగాణా బీజేపీలో ఆధిపత్య పోరు మెల్లగా ముసురుకుంటోందా అంటే జవాబు అవును అనే వస్తోంది. బీజేపీలో ఇపుడు వర్గాలు ఉన్నాయా అంటే నిజమే అంటున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిది ఆది నుంచి ఒక వర్గంగా ఉంటోంది. ఇక కరీంనగర్ నుంచి ఎంపీగా గెలిచిన బండి సంజయ్ ఎపుడైతే బీజేపీ ప్రెసిడెంట్ అయ్యారో నాటి నుంచి తనకంటూ ఒక వర్గాన్ని రెడీ చేసుకున్నారు అని అంటున్నారు. ఇపుడు వీటికి తోడు మాజీ మంత్రి, తెలంగాణా రాష్ట్ర సమితి పునాదుల నుంచి ఉంటూ వచ్చి మంత్రిగా సుదీర్ఘ కాలం పనిచేసిన ఈటెల రాజెందర్ ఇపుడు బీజేపీలో పవర్ ఫుల్ సెంటర్ కావాలనుకుంటున్నారు అని అంటున్నారు.
ఈ మధ్యన ఆయన మీద కేంద్ర నాయకత్వం కూడా ఫోకస్ పెట్టింది. అమిత్ షా కూడా ఆయనను దూసుకుపొమ్మని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఇక విషయానికి వస్తే బండి సంజయ్ ఈటెల రాజెందర్ ఇద్దరూ బీసీ వర్గానికి చెందిన వారే. దాంతో బీసీ లీడర్లను ఫోకస్ చేయాలనుకుంటున్న బీజేపీ హై కమాండ్ ఆలోచనలను పసిగట్టి ఈటెల కూడా ముందుకు రావాలనుకుంటున్నారు. ఆయన అసలే హుజూర్ బాద్ ఉప ఎన్నికల్లో గెలిచి టీయారెస్ ని ఢీ కొట్టి మరీ వచ్చారు.
పైగా టీయారెస్ లో రెండు దశాబ్దాలుగా ఉన్నారు. ఆయనకు తెలంగాణాలోని అన్ని చోట్ల టీయారెస్ కార్యకర్తలతో చాల బాగానే పరిచయాలు ఉన్నాయి. అంతే కాదు ఆయనకు టీయారెస్ హై కమాండ్ బలాలూ బలహీనతలు తెలుసు. దాంతో ఆయన్ని బాగా ఉపయోగించుకోవాలని హై కమాండ్ ఆలోచన చేస్తోంది. అదే టైమ్ లో ఈటెల కూడా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ బీజేపీలో టాప్ లెవెల్ కి ఎదగాలని చూస్తున్నారు అంటున్నారు.
ఇక బండి సంజయ్ నాయకత్వంలో పనిచేయడం కంటే తానుగా ముందుకు రావాలని ఆయన చూస్తున్నారు అని అంటున్నారు. ఈటెల లేటెస్ట్ గా కొన్ని కామెంట్స్ చేశారు. కేసీయార్ పోటీ చేసే గజ్వేల్ నుంచే తానూ బరిలో నిలబడతాను, ఆయన్నే ఓడిస్తాను అని. అది బీజేపీలో తన బేస్ ని పెంచుకోవడానికే అని అంటున్నారు. కేసీయార్ ని ఓడించేది నేనే అని కూడా ఈటెల బిగ్ సౌండ్ చేస్తున్నారు.
కేసీయార్ గుట్టుమట్లు నా కంటే ఎవరికీ తెలియవు అని ఈటెల చెబుతున్నారు. కేసీయార్ బలాలు బలహీనతలు నాకు అన్నీ ఎరుకే అని ఆయన ఒక వైపు టీయారెస్ కి స్ట్రాంగ్ డోస్ ఇచ్చినట్లుగా కనిపిస్తూనే మరో వైపు బీజేపీలో కూడా తన ప్లేస్ ని బలం చేసుకుంటున్నారు అని అంటున్నారు.
మొత్తానికి చూస్తే ఈటెల తాను ఎక్కడా తగ్గేట్లు లేదనే సంకేతాలు ఇస్తున్నారు. ఇక చూస్తే బండి సంజయ్ పదవీకాలం కూడా తొందరలో ముగుస్తోందని అంటున్నారు. ఒక వేళ అది కనుక జరిగితే ఈటెలకు బీజేపీ అధ్యక్ష పదవి ఇస్తారా అన్న చర్చ కూడా ఈటెలను ముందు పెడితే ఆపరేషన్ టీయారెస్ అన్నది బీజేపీకి సులువు అవుతుంది అన్న ఆలోచన కూడా బీజేపీ పెద్దలకు ఉందిట.
అయితే ఒక సాధారణ ఎమ్మెల్యేగా ఉంటీ ఆపరేషన్ టీయారెస్ కి ఈటెల అంతలా దృష్టి పెట్టరు కాబట్టి ఆయనకు తగిన హోదా గౌరవం ఇవ్వాలని బీజేపీ హై కమాండ్ భావిస్తోంది అంటున్నారు. దాంతో ఈటెల కూడా బండి వెనకాల తన బండిని కట్టి ఏపీ బీజేపీ బండినే ఏకంగా తోలడానికి రెడీ అవుతున్నారు అంటున్నారు.
అన్నట్లు టీయారెస్ లో ఉన్నపుడే ముఖ్యమంత్రి సీటు మీద ఈటెల కన్నేశాడని చెబుతారు. ఆ డౌట్లు రావడంతోనే ఆయన్ని జాగ్రత్తగా కేసీయార్ సాగనంపాడు అని చెబుతారు. ఇపుడు బీజేపీలో కూడా ఈటెల తన కోరికను నెరవేర్చుకోవడానికి ఎత్తులు పై ఎత్తులు వేస్తే మాత్రం బండి జోరుకు కళ్ళెం పడినట్లే. చూడాలి మరి బండి సంజయ్ కి సొంత పార్టీలోనే ఈటెల ముళ్ళు గుచ్చుకుంటే కాచేవరెవరో.