బొబ్బిలి రాజుకు హ్యాండిస్తున్నారా..?

Update: 2023-01-11 02:30 GMT
బొబ్బిలి రాజుకు హ్యాండిస్తున్నారా..?
  • whatsapp icon
ఆయన రాజకీయం ఘనం, రాచరికం ఒక చరిత్ర. బొబ్బిలి రాజులు అంటే పౌరుషానికి ప్రతీకలు. ఓటమి ఎరుగని విజేతలు. ఇక ప్రజాస్వామిక యుగంలో కూడా వారికి తిరుగులేదు. అలాంటి వంశీకుడిగా మాజీ మంత్రి సుజయ క్రిష్ణ రంగారావు ఉన్నారు. ఆయన రాజకీయ అరంగేట్రాన్ని 2004లో చేశారు. వైఎస్సార్ ప్రోత్సాహంతో ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు.

ఆయన ముందు పూర్వీకులు కూడా కాంగ్రెస్ ని నమ్ముకుని రాజకీయాలు చేస్తూ వచ్చారు. మద్రాస్ ప్రెసిడెన్సీలో మంత్రులుగా ముఖ్యమంత్రులుగా పనిచేసిన చరిత్ర వారికి ఉంది. ఇక ఆ వారసత్వాన్ని నిలబెడుతూ సుజయక్రిష్ణ రంగారావు మూడు సార్లు ఎమ్మెల్యేగా నెగ్గారు. ఆయన కాంగ్రెస్ నుంచి 2004, 2009లలో గెలిస్తే వైయస్సార్ అకాల మరణం తరువాత వైసీపీలో చేరిపోయారు.

ఆ నేపధ్యంలో 2014లో వైసీపీ నుంచి ఆయన మళ్ళీ గెలిచారు. జగన్ సైతం ఆయనకు సముచిత స్థానం కల్పించారు. కానీ ఆయన 2017లో తెలుగుదేశంలో చేరారు. దాంతో ఆయన మంత్రి అవగలిగారు కానీ మళ్లీ ఎమ్మెల్యే అవలేకపోయారు. అలా పార్టీ మారడం వల్ల బ్యాడ్ నేమ్ వచ్చింది అని అంటారు. 2019 ఎన్నికల్లో ఆయనను వైసీపీ తరఫున పోటీ చేసిన  శంబంగి చిన అప్పలనాయుడు ఓడించారు.

హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా పేరు తెచ్చుకున్న సుజయక్రిష్ణ రంగారావుని తొలిసారి ఓటమి పలకరించడంతో వైరాగ్యంలో కూరుకుపోయారని అంటారు. ఆయన విశాఖలోనే ఉంటూ తన సొంత నియోజకవర్గం బొబ్బిలిని పట్టించుకోలేదు అని కూడా చెబుతారు. ఇలా కాలం గిర్రున తిరిగిపోయింది. ఇపుడిపుడే టీడీపీని జనాదరణ కనిపిస్తోంది. తాజాగా చంద్రబాబు విజయనగరం టూర్ చేసినపుడు బొబ్బిలిలో పెద్ద ఎత్తున జనాలు తరలి వచ్చారు.

ఈ టూర్ లో ఆయన పక్కన బొబ్బిలి తెలుగుదేశం ఇంచార్జి బేబీ నాయన కనిపించారు. ఇక చంద్రబాబు సైతం వచ్చే ఎన్నికల్లో బొబ్బిలి టికెట్ ని బేబీ నాయనకే కేటాయిస్తారని ప్రచారం సాగుతోంది. పార్టీ కష్టకాలంలో ఉన్నపుడు బేబీ నాయనే ముందుండి నడిపించారని అధినాయకత్వం ఆలోచిసోంది. అంతే కాదు బొబ్బిలి మునిసిపాలిటీలో కూడా తెలుగుదేశానికి ఎక్కువ మంది కౌన్సిలర్లు వచ్చేలా చేసిన ఘనత కూడా బీబీ నాయనదే అని అంటున్నారు.

దాంతో ఆయనకే టికెట్ కన్ ఫర్మ్ అని అంటున్నారు. మరి మాజీ మంత్రి సుజయ  జ క్రిష్ణ రంగారావుకు టికెట్ ఉంటుందా అంటే లేదు అనే జవాబు వస్తోంది. ఆయన చూస్తే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని చూస్తున్నారు. మరి చంద్రబాబు మాత్రం పనిచేఇస్న వారికే టికెట్లు అన్న నియమం పెట్టుకున్నారు అని అంటున్నారు.

దాంతో మాజీ మంత్రి రాజకీయానికి ఫుల్ స్టాప్ పడిపోయింది అని అంటున్నారు. ఇంతకాలం అన్న చాటు తమ్ముడిగా రాజకీయం చేసిన బేబీ నాయన ఇపుడు ఎమ్మెల్యేగా పోటీ చేయబోతారు అని అంటున్నారు. మరి తమ్ముడు గెలిస్తే ఇక బొబ్బిలి కోటలో తమ్ముడిదే హవా అవుతుంది అని కూడా అంటున్నారు. సుజయ క్రిష్ణ రంగారావు రాజకీయ వైరాగ్యమే కంటిన్యూ అయిపోతుంది అని కూడా అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News