``అంటే అన్నామని అంటారు.. కానీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అజెండా ఏంటి?`` ఇదీ ఇప్పుడు మేధావులు చేస్తున్న కామెంట్లు. ఏ రాజకీయ పార్టీకైనా.. ఒక అజెండా అంటూ ఉండాలి. ఎన్నికలకు ముందు అయినా.. తర్వాత అయినా.. ఇది దండలో దారం లాంటింది. ప్రజలను.. పార్టీని ముడివేసేది అజెండానే. ఈ విషయం ఎవరికీ తేడా లేదు. అయితే, వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేస్తాను.. అని చెబుతున్న పవన్ అజెండా ఏంటి? అనేది చర్చకు వస్తోంది.
ఒక పార్టీ ఏదైనా ఎందుకంటే.. ఎన్నికలకు వెళ్లాలంటే.. ఆ పార్టీ తమకు ఏం చేస్తుంది? ఆ పార్టీని గెలిపిస్తే.. తమకు ఎలాంటి ప్రయోజనం చేకూరుతుంది? అనే విషయాన్ని పదే పదే ప్రజలు ఆలోచన చేస్తారు. గతంలో వైసీపీ ఏడాదిన్నరముందే ప్రచారం ప్రారంభించి.. తాము చేసేది చెప్పుకొచ్చింది. రాజన్న రాజ్యం తెస్తామని.. ఆరోగ్య శ్రీని బలోపేతం చేస్తామని.. రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని.. ఇలా అనేక హామీలను ఇచ్చింది.
ఇది ప్రజల్లోకి బాగా పోయింది. ఫలితంగా వైసీపీ విజయం దక్కించుకుంది. కనీ వినీ ఎరుగని రీతిలో వైసీపీ 151 సీట్లతో ముందుకు సాగుతోంది. అంటే.. ఇక్కడ కీలక సారాంశం ఏంటి? అంటే.. ప్రజలకు ఒక స్పష్టమైన హామీ ఇచ్చింది. మరి ఈ తరహా వ్యూహాన్ని జనసేన ప్రచారం చేస్తోందా? అనేది ప్రశ్న. తాము అధికారంలోకి వస్తే.. ఇలా చేస్తాం..అలా చేస్తాం.. అని ఒక అజెండా ప్రకటించిందా? అనేది మేదావులు సైతం దృష్టి పెడుతున్నారు.
గతంలో ఏ ఇద్దరు మహిళలు కలిసినా.. జగన్ వస్తే ఇది చేస్తాడు.. అది చేస్తాడు.. అని చర్చించుకునే పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితి పవన్ కల్పించాడా? అంటే లేదు. తన అజెండా ఏంటి? అంటే.. వైసీపీని గద్దె దించడం.. వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చేయడం. అంతకుమించి? అని ఎవరైనా అడిగితే.. తడుముకోవడం, నీళ్లు నములుకోవడం తప్ప.. పవన్ దగ్గర ఏమీ కనిపించడం లేదనేది వాస్తవం. మరి ఇలా అయితే.. ప్రజలు ఓట్లేసేది ఎలా? అనే మేధావులు ప్రశ్నిస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.