వచ్చే ఎన్నికలు అత్యంత కీలకం తెలుగుదేశం పార్టీకి. ఈసారి గెలిస్తే అధికారంలో ఉంటుంది. లేకపోతే చరిత్రలో ఉంటుంది. ఇది ప్రత్యర్ధి పార్టీలు చెప్పడం కంటే సొంత పార్టీ వారికే బాగా తెలుసు. చంద్రబాబు ఈ ఎన్నికల్లో గెలుపు పిలుపు కోసం ఎంత చేయాలో అంతా చేస్తున్నారు. ఇక చంద్రబాబుతో పాటు చాలా ఇంపార్టెంట్ గా ఈ ఎన్నికలు ఉండబోతున్నాయి.
వారే అనంతపురం జిల్లాలో జేసీ బ్రదర్స్ గా పేరు మోసిన బిగ్ షాట్స్. కాంగ్రెస్ టూ తెలుగుదేశం పార్టీలోకి ఎకాఎకిన వచ్చేసి జేసీ దివాకర్ రెడ్డి ఎంపీ అయిపోతే తమ్ముడు ప్రభాకరరెడ్డి ఎమ్మెల్యే అయిపోయారు. ఈ ఇద్దరూ 2019 నాటికల్లా మాజీలు అయ్యారు. వారసులుగా తమ కుమారులను నిలబెడితే వారు కూడా ఓడిపోయారు.
చూస్తూండగానే 2024 ఎన్నికలు వస్తున్నాయి. ఓడిన బాధలు, పాత గాయాలు మానలేదు, మళ్ళీ బస్తీ మే సవాల్ అనాలంటే ఎలా అన్నదే జేసీలకు ఉన్న సమస్య. తమ వారసులను అందలం ఎక్కించాలని తాపత్రయపడుతున్న జేసీ బ్రదర్స్ కి బాబు షాక్ ఇచ్చారని టాక్. వచ్చే ఎన్నికల్లో మీ కుమారులు కాదు మీ ఇద్దరే పోటీ చేయండి అంటూ ఆయన ఆదేశం లాంటి సందేశం పంపించారు.
దాంతో జేసీ బ్రదర్స్ మల్లగుల్లాలు పడుతున్నారు. జేసీ దివాకరరెడ్డి అయితే ఏడున్నర పదుల వయసు దాటేశారు. వచ్చే ఎన్నికల నాటికి ఇంకా ఎక్కువ అవుతుంది కానీ తగ్గదు, ఆయన తన కుమారుడు పవన్ కుమార్ రెడ్డిని అనంతౌరం ఎంపీగా దింపి ఆయన్ని గెలిపించి తాను హ్యాపీగా రిటైర్ అయిపోవాలనుకుంటున్నారు. ఇక ప్రభకరరెడ్డి కూడా అంతే. అస్మిత్ రెడ్డిని తాడిపత్రి నుంచి ఎమ్మెల్యేగా దించాలని చూస్తున్నారు.
అయితే మీ ఇద్దరే నాకు కావాలని బాబు కోరడంతో జేసీ బ్రదర్స్ ఆలోచనలో పడిపోయారట. వచ్చే ఎన్నికలు ఇపుడు ఈ ఇద్దరు వృద్ధ నేతలకు చాలా సీరియస్ గానే కనిపిస్తున్నాయని అంటున్నారు. 2019 ఎన్నికల్లో తమ హవాకు ఎదురులేదని యువకులైన కుమారులని నిలబెడితే టోటల్ గా బోల్తా కొట్టింది. ఒక విధంగా అది ఇబ్బందిగానే ఉంది. ఇపుడు తామే పోటీకి ఢీ కొట్టి రంగంలో ఉంటే తీరా ఫలితం ఎలా ఉంటుందో తెలియదు. ఆ టెన్షన్ లో జేసీ బ్రదర్స్ ఉన్నారని టాక్.
ఇక అనంతపురం జిల్లాలో చూస్తే రాయదుర్గం, శింగనమల, అనంతపురం అర్బన్, , కళ్యాణదుర్గం , పుట్టపర్తి తదితర నియోజకవర్గాల్లో జేసీ బ్రదర్స్ కి బలం పట్టు ఉన్నాయి. అక్కడ బంధుగణం చాలా ఉంది. అనుచరులు ఉన్నారు. దాంతో తమ వారికి టికెట్లు కోసం జేసీ బ్రదర్స్ బాబు వద్ద ప్రయత్నం చేస్తే తరువాత చూద్దామని బాబు చెప్పడంతో ఆలోచనలో పడ్డారని అంటున్నారు.
అంటే ఈసారి జేసీ బ్రదర్స్ సత్తా ఏంటో చూసేయాలని పాజిటివ్ అయితే ఫుల్ గా వాడేసుకోవాలని బాబు కూడా ప్లాన్ వేశారన్న మాట. అయితే జేసీ బ్రదర్స్ ఈ వయసులో పోరు చేయాలి. గెలవాలి. దాంతో చంద్రబాబు కంటే కూడా వారికే 2024 ఎన్నికల విషయంలో బీపీ ఎక్కువగా ఉందిట. ఏం చేస్తారో తెలియదు కానీ ఇపుడు వారి బాధ 2024 ఎన్నికలలో జీవిత కాల బాధగానే ఉంది అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.