మాట మార్చిన కోమటిరెడ్డి.. నాలుక మడతెట్టేశాడే?

Update: 2022-08-25 16:11 GMT
రాజకీయాలు అన్నాక ఒక క్లారిటీ ఉండాలి. ఒక మాట మీద నిలబడాలి. ‘మడమ తిప్పడు.. మాట తప్పని’ వైఎస్ఆర్ వారసత్వాన్ని కంటిన్యూ చేయాలి. ఆయన హయాంలో రాజకీయంగా ఎదిగిన కోమటిరెడ్డిలో మాత్రం అవేవీ లేవని అర్థమవుతోంది. తమ్ముడు రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి వెళ్లినా కుక్కురుమనకుండా కాంగ్రెస్ లో అసమ్మతి రాజేస్తున్నాడు అన్న ఎంపీ వెంకటరెడ్డి.

పోనీ తమ్ముడుతోపాటు బీజేపీలోకి వెళతాడా? అంటే అదీ లేదు. పోనీ తమ్ముడిని ఓడించడానికి మునుగోడులో కాంగ్రెస్ తరుఫున ప్రచారం చేస్తావా? అంటూ దానికి ఒప్పుకోరు. ఈ కోమటిరెడ్డి రాజకీయం కాంగ్రెస్ ను సర్వనాశనం చేయడానికా? అని రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తే వారిపై విరుచుకుపడుతాడు. మరి ఒక క్లారిటీ.. మాట మీద లేని లీడర్ లా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎన్నాళ్లీ రాజకీయం చేస్తాడని అందరూ ప్రశ్నిస్తున్నారు. కోమటిరెడ్డి తీరును సొంత పార్టీ నేతలే నమ్మని పరిస్థితి ప్రస్తుతం నెలకొంది.

కాంగ్రెస్ పార్టీ తన సీటు అయిన మునుగోడును గెలవడానికి ప్రధాన అడ్డంకిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిలుస్తున్నారు. ఎందుకంటే నల్గొండ జిల్లాలో ఆయనకు పట్టుంది.కానీ ఆయన పార్టీ మారిన తన తమ్ముడిని ఓడించడానికి ఇష్టపడడం లేదు. అందుకే అక్కడ ప్రచారం చేయనని తొలుత అన్నారు.

నిన్న ప్రియాంకాగాంధీతో భేటి తర్వాత తన మనసు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మార్చుకున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ లో మునుగోడు ఎన్నిక వివాదం ముగిసినట్లు కనిపిస్తోంది.

కోటిరెడ్డి వెంకట్ రెడ్డి తాను ఉప ఎన్నికల్లో ప్రచారం చేస్తానని ప్రకటించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ మేరకు ఆయన ప్రకటించారు. అయితే తమ్ముడిని ఓడించేందుకు మనస్ఫూర్తిగా ప్రచారం చేస్తాడా? లేక కాంగ్రెస్ కు వెన్నుపోటు లాంటిది పొడుస్తారా? అన్నది తేలాల్సి ఉంది.

రాజకీయాలు అన్నాక అత్యంత ముఖ్యమైనది విశ్వసనీయత.. అది వెంకటరెడ్డి గారు పోగొట్టుకున్నారని అనిపిస్తోందని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. మునుగోడు విషయంలో ఆ క్రెడిబిలిటీని వెంకటరెడ్డి కోల్పోయారు. ఇప్పుడక్కడ కాంగ్రెస్ ఓడితే ఆ పాపంలో వెంకటరెడ్డిది భాగస్వామ్యం ఉందని చెప్పకతప్పదు. సొంత పార్టీలో ఉండి సొంత పార్టీకే వెన్నుపోటు పొడిచే రాజకీయం ఎందుకు చేస్తారని.. కావాలంటే తమ్ముడితోపాటు బీజేపీలో చేరిపోవచ్చని పలవురు హితవు పలుకుతున్నారు. మరి కోమటిరెడ్డి ఈ రాజకీయం ఎన్నాళ్లు చేస్తాడన్నది వేచిచూడాలి.
Tags:    

Similar News