'మోడీ' దాగుడు మూత‌లు.. లాభ‌మెంత‌? న‌ష్ట‌మెంత‌?

Update: 2022-12-01 16:30 GMT
ఏపీతో కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం ముఖ్యంగా ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ దాగుడు మూత‌లు ఆడుతున్నార నేది వాస్త‌వం. దీనిపై అనేకవిమ‌ర్శ‌లు కూడా వ‌స్తున్నాయి. పార్టీని ఇక్క‌డ డెవ‌ల‌ప్ చేయాల‌ని రాష్ట్ర నేత‌ల‌కు దిశానిర్దేశం చేస్తారు. అంతేకాదు.. సీఎంజ‌గ‌న్ స‌హావైసీపీ ప్ర‌బుత్వంపై విమ‌ర్శ‌లు చేయాల‌ని.. ప్ర‌జ‌ల్లోకి వెళ్లాల‌ని.. యువ‌త‌ను ఆక‌ట్టుకుని తీరాల‌ని ఇటీవ‌ల స‌ల‌హా ఇచ్చారు. కానీ, ఇంత‌లోనే ఆయ‌న‌వ్యూహం మారిపోయింది.

ఎందుకంటే.. కేంద్రం స‌హ‌క‌రిస్తుండ‌డంతో రాష్ట్రంలో వివిధ ప‌నులు ముందుకు సాగుతున్నాయి. దీంతో బీజేపీ నాయ‌కులు విమ‌ర్శించ‌లేని ప‌రిస్థితి ఏర్ప‌డింది. పైగా జ‌గ‌న్‌ను ద‌త్త‌పుత్రుడిగా కూడా ప్ర‌ధాని పేర్కొన‌డం.. రాష్ట్ర నేత‌ల‌కు ఇబ్బందిగానే మారింది. ఇలా చేయ‌డం వ‌ల్ల ప్ర‌యోజ‌నం లేదుక‌దా?అ నేది సీనియ‌ర్ నాయ‌కుల మాట‌. మ‌రోవైపు.. కొంద‌రు నేత‌లు జాతీయ స్థాయిలో చ‌క్రం తిప్పుతుండ‌డంతో రాష్ట్రంలో వారి మాట మ‌చ్చుకుకూడా వినిపించ‌డం లేదు.

దీనిపైనా.. మోడీ ఇటీవ‌ల కొన్ని దిశానిర్దేశాలు చేశారు. జాతీయ నేత‌లు వారి రాజ‌కీయాలు వారు చూసు కుంటార‌ని అన్నారు. అలాగ‌ని రాష్ట్ర నేత‌లు స్పందిస్తే వెంట‌నే జాతీయ నేత‌లు రియాక్ట్ అవుతున్నారు. ఇప్పుడు తాజాగా వివేకా కేసును రాజ‌కీయంగా వాడుకునేందుకు ఒక‌రిద్ద‌రు రెడీ అయ్యారు. కానీ, ఇంత‌లోనే ఇది రాష్ట్ర అంశం కాబ‌ట్టి.. మేమే స్పందిస్తాం అంటూ.. కొంద‌రు కీల‌క నాయ‌కులు చెప్పుకొచ్చారు. నిజానికి ఈ ప‌రిణామం బీజేపీకి క‌లిసి వ‌చ్చేదే.

సీబీఐ ద‌ర్యాప్తుపైనే రాష్ట్ర‌ప్ర‌భుత్వ పెత్త‌నం ఉంద‌ని ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్ల‌డం, వివేకా కేంద్రంగా సీమ‌లో రాజ‌కీయాలను వేడెక్కించాల‌ని మాజీ మంత్రి ఆదినారాయ‌ణ‌రెడ్డి, సీఎం ర‌మేష్ వంటివారి సూచ‌న‌. అయితే.. దీనిని తామే డీల్ చేస్తామ‌ని చెప్పుకొచ్చారు రాష్ట్ర పార్టీ చీఫ్‌. దీంతో దీనిపై ఎవ‌రూ మాట్లాడ‌లేదు. ఫ‌లితంగా ద‌క్కిన ఛాన్స్‌ను వ‌దులుకున్న‌ట్టు అయింది.

దీనిని రాజ‌కీయంగా వాడుకుని ఉంటే.. బాగుండేద‌నే అభిప్రాయం ఉంది. కానీ, ఎంత సేపూ.. గుడులు.. గోపురాలు అంటూ.. వాటినే రాజ‌కీయం చేయ‌డం చీపు లిక్క‌రు 50కే ఇస్తామ‌ని ప్ర‌చారం చేయ‌డం ద్వారా.. ప్ర‌జ‌ల‌కు దూర‌మ‌వుతున్నామా?  ద‌గ్గ‌ర‌వుతున్నామా? అనేది పార్టీలో ఆస‌క్తిగా మారింది. అయితే.. ఇప్పుడు  అంద‌రి చూపూ ప్ర‌ధానిపై ప‌డింద‌ని అంటున్నారు. ఆయ‌న వ్యూహాల‌తో న‌ష్ట‌మా?  లాభ‌మా? అనేది చ‌ర్చ‌కు దారితీస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News