ఎన్టీయార్ చమట చిందించారు. రెక్కల కష్టంతో రోడ్లన్నీ తిరిగారు. ఆరు పదుల ముదిమి వయసులో దేన్ని ఖాతరు చేయకుండా ఆరుగాలం ఉమ్మడి ఏపీ అంతటా జాతర చేసి మరీ తెలుగుదేశం పార్టీని ప్రతీ ఇంటికీ చేర్చారు. మూడున్నర దశాబ్దాల తన సినీ గ్లామర్ ని ఆయన పెట్టుబడిగా పెట్టారు. తెలుగుదేశం ఎన్టీయార్ ఆస్తి, ఆయన సొత్తు. ఆయన సర్వస్వం. అప్పటికి మూడున్నర పదుల ఏళ్ళుగా ఉమ్మడి ఏపీని ఏలుతూ మహా వృక్షమై పాతుకుపోయిన కాంగ్రెస్ కోటను కేవలం తొమ్మిది నెలల్లో బద్ధలు కొట్టారు ఎన్టీయార్. అందుకే ఆయన మగాడు.
ఇక నందమూరి పేరే ఒక బ్రాండ్. అందులోనే ఎన్నో పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి. అసాధ్యాన్ని సుసాధ్యం చేయడం అంటే ఎన్టీయార్ వైపే చూడాలి. కాదు అనుకున్నది అవును అనిపించే మొండిఘటం ఎన్టీయార్. మరి ఆయన పెట్టిన పార్టీ ఇపుడు ఎవరి చేతుల్లో ఉంది. నారా మయం అయింది. ఎన్టీయార్ ఏమైనా బ్రహ్మచారా. పోనీ ఆయనకు వారసులు లేరా. వారు ఏమైనా టాలెంట్ లేకుండా ఉన్నారా. వారు ఎవరూ జనాలకు తెలియదా అంటే ఇవేమీ కాదు.
ఎన్టీయార్ కొడుకులల్లో ఇద్దరు జనాలకు సుపరిచితం. హరిక్రిష్ణ బాలక్రిష్ణ ఈ ఇద్దరూ ఆయన సిసలైన వారసులుగా సినీ రంగాన నిలిచారు. హరిక్రిష్ణ అయితే రాజకీయాల్లో కూడా ఎంతో కొంత రాణించారు. బాలయ్య ఎమ్మెల్యేగా తన నియోజకవర్గంలో భేష్ అనిపించుకున్నారు. జగన్ వేవ్ లో సైతం రెండవసారి వరసగా తెలిచి సత్తా చాటారు.
ఇక ఎన్టీయార్ మనవళ్ళ విషయం తీసుకుంటే జూనియర్ ఎన్టీయార్ పాన్ ఇండియా స్టార్ గా ఈ రోజు వెలుగుతున్నారు. అలాగే మరో మనవడు కళ్యాణ్ రామ్ కూడా చక్కని నటుడిగా ప్రూవ్ చేసుకున్నారు. మరి అలాంటి నందమూరి కుటుంబం టీడీపీ సారధ్యాన్ని చేపట్టడానికి ఎందుకు సంకోచిస్తోంది. తమ తాత పెట్టిన పార్టీ పగ్గాలు తీసుకుని జనంలోకి తీసుకుపోవడానికి ఎందుకు ఆలోచిస్తోంది ఇదే ప్రశ్న అందరికీ దొలిచేస్తోంది.
చిత్రంగా ఇదే విషయాన్ని మాజీ మంత్రి వైసీపీ ఎమ్మెల్యే అయిన అనిల్ కుమార్ యాదవ్ గట్టిగానే చెప్పారు. ఎన్టీయార్ మనవళ్ళూ మీరు చేయాల్సింది చిన్న చిన్న విషయాల మీద పోరాటాలు కాదు, పార్టీ మీది, టీడీపీ అంటేనే అన్న గారిది. ఆ పార్టీని మీరు తీసుకోండి. ఇవ్వకపోతే బలవంతంగా అయినా లాక్కోండి అంటూ రెచ్చగొట్టే టైప్ లో సూచనలు చేశారు. మీరు తొడకొట్టడాలు శపధాలు చేయడాలూ చేయాల్సింది అంతా టీడీపీని చేతుల్లోకి తీసుకునే విషయం మీద చూపించాలి అంతే తప్ప ఊరికే సౌండ్స్ ఎందుకబ్బా అంటూ నెల్లూరు భాషలో అనిల్ పంచులేశారు.
నారా హమారా అంటున్నారు అక్కడ. టీడీపీ అంతా నారామయం అయిపోతోంది. అది కాదు నందమూరి హమారా అనిపించాలి. నందమూరి హమారా అన్న స్లోగన్ టీడీపీలో వినిపించాలి అని అనిల్ కుమార్ యాదవ్ ఎన్టీయార్ మనవళ్ళకు షాకిచ్చేలా స్టేట్మెంట్స్ వదిలారు. చంద్రన్న కానుక, చంద్రన్న తోఫా అని పెట్టారు కానీ ఎన్టీయార్ కానుక అని ఎందుకు పెట్టలేకపోయారు అని నిగ్గదీయాలి. టీడీపీలో అన్న గారి అసలైన వారసులు ముందుకు రావాలి. మీ పౌరుషం అలా చూపించాలి. అంతే తప్ప వేరే విషయాల మీద మాట్లాడడం కాదు అంటూ అనిల్ కుమార్ యాదవ్ అంటున్నారు.
సరే ఆయన హెల్త్ వర్శిటీ మీద అన్న గారి మనవళ్ళు చేసిన ట్వీట్లకు రివర్స్ లో అటాక్ చేశారని అనుకున్నా ఇందులో చాలా లాజిక్ పాయింట్స్ ఉన్నాయి. మహా భారతంలో దుర్యోధనుడు క్రిష్ణుడితో రాయబారం సీన్లో అంటారు. మేము మా తండ్రి గారికి అసలైన వారసులం. మేము ఎవరికీ మా రాజ్యం పంచమని చెబుతారు. అలా నందమూరి వంశీకులు తమదే టీడీపీ అని చెప్పాలి. తామే అసలైన వారసులను ముందుకు రావాలని అంతా కోరుకుంటున్నారు. మరి అది జరిగే పనేనా..
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.