నారా లోకేష్ ఈ రోజుకి కూడా కేరాఫ్ చంద్రబాబు అని చెప్పాల్సిందే. ఆయన ఒక దిగ్గజ నేతకు రాజకీయ వారసుడిగానే అంతా చూస్తున్నారు. దానికి కారణం లోకేష్ తానుగా ఇంకా రుజువు చేసుకోవాల్సింది చాలా ఉంది. అయితే టీడీపీలో లోకేష్ బలమెంత అన్నది కనుక చూస్తే సీనియర్ లీడర్స్ అంతా చంద్రబాబుని అల్లుకుని ఉన్నారు. జూనియర్లు అంటే వారి వారసులే లోకేష్ తో ఉంటున్నారు.
లోకేష్ బాబే భావి నాయకుడు. టీడీపీకి ఆశాకిరణం అని వారు కొనియాడుతూ ఉంటారు. మంత్రులుగా పనిచేసిన వారు, ఎమ్మెల్యేలుగా నెగ్గిన వారి పుత్ర రత్నాలు, పుత్రికా రత్నాలు ఇపుడు టీడీపీలో లోకేష్ గ్యాంగ్ గా మారిపోయారు. తాజాగా అనంతపురం జిల్లాలోని పరిటాల శ్రీరాం లోకేష్ ని ఒక రేంజిలో పొగిడేశారు. లోకేష్ ఫ్యూచర్ ఆఫ్ టీడీపీ అని ఆయన మాట్లాడారు.
ఆయన లోకేష్ కోటరీలో కీలకంగా ఉంటు న్నారు.. అదే విధంగా చూస్తే ఉత్తరాంధ్రా జిల్లాలో మాజీ మంత్రులు అయ్యన్న పాత్రుడు కుమారుడు విజయ్ పాత్రుడు, బండారు సత్యనారాయణమూర్తి వారసుడు అప్పలనాయుడు, కింజరాపు రామ్మొహననాయుడు, గౌతు శిరీష, ప్రతిభా భారతి కుమార్తె గ్రీష్మ ఇలా వీళ్ళంతా లోకేష్ టీం గా చలామణీ అవుతున్నారు.
అంటే తండ్రులు తాముగా వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చేసి వారసులను ఇలా లోకేష్ బ్యాచ్ గా రెడీ చేస్తున్నారు అని అంటున్నారు. దీని వల్ల లోకేష్ తో పాటు మరో మూడు దశాబ్దాల పాటు తమ పుత్ర రత్నాలకు కూడా రాజకీయం చేయగలరు అన్న దూరాలోచనతోనే వారు ఈ రకంగా చేస్తున్నారు. దీని వల్ల లోకేష్ కి టీడీపీలో బలం పెరుగుతుందని అధినాయకత్వం కూడా ప్రోత్సహిస్తోంది.
కానీ టీడీపీలో నిజానికి యూత్ అంటే ఎవరు అన్న ప్రశ్న ఇపుడు వస్తోంది. పార్టీలో ఆది నుంచి జెండా మోసిన వారున్నారు. వారంతా పదవులు దక్కీ దక్కక సైడ్ అయిపోయారు. తరువాత తరంలో వారు స్వచ్చందంగా పార్టీలో చేరి పనిచేసిన వారు కూడా రాజకీయంగా పలుకుబడి కలిగిన కుటుంబాల ధాటికి పక్కకు పోతున్నారు. చంద్రబాబు అయితే యువతకు ప్రోత్సాహం ఇస్తాం, టికెట్లు ఇస్తామని చెబుతున్నారు. కానీ నిజానికి టికెట్లు ఇచ్చేవన్నీ వారసులకే అని అంటున్నారు.
వారసులు నాయకులు కాదని కాదు కానీ పార్టీలో అందరికీ అవకాశాలు ఇస్తే టీడీపీ మరింత కాలం గట్టిగా జనంలో నిలబడుతుంది అని అంటున్నారు. అయితే జూనియర్ లీడర్స్, ఏ అండా లేకుండా పార్టీ కోసం పనిచేసేవారికి నియోజకవర్గ స్థాయిలలోనే ఇబ్బందులు ఎదురవుతున్నాయని, దాంతో వారు తమకు పార్టీలో అవకాశాల సంగతి ఏంటి అని ఆశగా అడుగుతున్న పరిస్థితి ఉంది.
చంద్రబాబుతో తండ్రులు, కొడుకుతో వారసులు ఉంటే ఇదేనా యూత్ అన్న ప్రశ్న కూడా వస్తోంది. చంద్రబాబు ఈ మధ్య తరచూ ఒక్క మాట చెబుతున్నారు. యువతకు అవకాశాలు అని. అలాగే ఒక కుటుంబానికి ఒక్కటే టికెట్ అన్న దానిని అమలు చేస్తామని, ఆ విధంగా కచ్చితంగా లెక్క చూసి మరీ పనిచేసే వారికి ఎలాంటి వారసత్వ వాసనలు లేని వారిని గతంలో ఎన్టీయార్ ప్రోత్సహించిన తీరులో కనుక ముందుకు తీసుకు వచ్చి టికెట్లు ఇస్తే టీడీపీకి అదే అసలైన బలం అవుతుందని, అదే శ్రీరామ రక్షగా ఉంటుందని అంటున్నారు. మరి ఆ విధంగా చేయగలరా అన్నదే ఇపుడు చర్చ.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.