రావి శాస్త్రి : ఒక స్మ‌రణ ఒక జ్ఞాప‌కం కూడా !

Update: 2022-08-01 16:30 GMT
ప్ర‌ముఖ ర‌చ‌యిత రావిశాస్త్రికి ఇప్పుడు వందేళ్లు అన‌గా శ‌త జ‌యంతి.  వందేళ్ల క‌థ‌కుడికి ఏమ‌ని నివాళి రాయాలి.ఇదే ప్ర‌శ్న నుంచి స‌మాధానం వెతుక్కుంటే ఆరు సారా క‌థ‌లు గుర్తుకు వ‌స్తాయి. వీలుంటే అల్ప‌జీవి కూడా గుర్తుకువ‌స్తుంది. బాగా రాయాలి అన్న త‌లంపు ఉన్న‌వారికి ఈ ఉత్త‌రాంధ్ర బ‌డుగు బ్రాహ్మ‌డు బాగానే గుర్తుకువ‌స్తాడు.

ఆ విధంగా నిన్న‌టి వేళ అత్యున్న‌త న్యాయ స్థానానికి అధిప‌తి అయిన చీఫ్ జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ కూడా ఆయ‌న్ను స్మ‌రించేరు. ఆ రోజుల్లో ఆయ‌న రాసిన వ‌చ‌న సాహిత్య రీతి త‌న‌ను ఏ విధంగా ప్ర‌భావితం చేసిందో కూడా చెప్పారు. తాను కొన్ని వంద‌ల ఆరు సారా క‌థ‌ల పుస్త‌కాల‌ను ప్ర‌చురించి పంచేన‌ని  కూడా గుర్తు చేసుకున్నారు ఈ సంద‌ర్భంగా !

భావాన్నీ త‌ద‌నుగుణ భాష‌నూ ముఖ్యంగా తెలుగు భాష‌ను ఎంతో ఉన్న‌త స్థాయిలో ఉప‌యోగించే న్యాయ‌మూర్తి ఎన్వీ ర‌మ‌ణ.ఆ విధంగా నిన్న‌టివేళ కథ‌కుల తిల‌కుడు రావి శాస్త్రి (క‌వి కుల తిల‌కుడు కాళిదాసు) మ‌రోసారి శ‌త జ‌యంతి వేళ ఓ తీర్పులోసామాజిక వాస్త‌విక‌త ఏ మేర‌కు ఉండాలో, అది ఏ విధంగా ప్ర‌భావితం చేస్తుందో అన్న‌ది ఎన్నో ఏళ్ల కింద‌టే తన కథ‌ల్లో, క‌థానుగ‌మ‌న రీతుల్లో చాటి చెప్పిన గొప్ప క‌థ‌కులు ఆయ‌న అని  స్మరించారు.

తెలుగు భాష కు సంబంధించి గ‌ర్వించ‌ద‌గ్గ ర‌చ‌యిత‌ల్లో ఆయ‌న స్థానం అగ్ర‌గ‌ణ్యం అని కూడా అన్నారాయ‌న. రాచ‌కొండ విశ్వ‌నాథ శాస్త్రి (రావిశాస్త్రి) కి తాను ఏక‌ల‌వ్య శిష్యుడిని అని గ‌ర్వంగా ప్ర‌క‌టించారాయ‌న. తెలుగు భాష ఉన్న‌తిని , ఔన్న‌త్యాన్ని చాటిన క‌థ‌కుల‌ను ఈ విధంగా దేశ అత్యున్న‌త  న్యాయాధికారి ప్ర‌స్తుతించ‌డం ఎంత‌గానో అభినందనీయం.

తెలుగు రాష్ట్రాల‌లో భాష‌కూ, వ్య‌క్తీక‌ర‌ణ‌కూ, ఇంకా చెప్పాలంటే వాటి మ‌ధ్య స‌మ‌తుల్య‌త‌కూ ఎంతో కృషి చేసిన సాహితీవేత్త రావిశాస్త్రి ఒక‌రు కావడం ఎంద‌రికో ఓ స్ఫూర్తి. అటువంటి స్ఫూర్తికి కొన‌సాగింపుగా ఇవాళ ఎంద‌రెంద‌రో ఉన్నత స్థానాల‌లో ఉన్న‌వారు ప‌నిచేస్తుండ‌డం నిజంగానే ఆయ‌న రాసిన వ‌చ‌న సాహిత్యానికి క‌థా సాహిత్యానికి ద‌క్కిన గొప్ప గౌర‌వం. ఆద‌రం కూడా !
Tags:    

Similar News