ఏపీలో సంక్షేమం అద్భుతం నభూతో నభవిష్యత్ అని వైసీపీ ప్రభుత్వ పెద్దలు అనుకుంటున్నారు. కాస్తా ముందుకెళ్ళి వైనాట్ 175 అని కూడా ధీమా పడుతున్నారు. గడప గడపకూ తిరగండి మన పధకాలు చెప్పి జనంలో ప్రచారం చేయండి, ఎందుకు మనం గెలవమని కూడా స్వయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎమ్మెల్యేలను వర్క్ షాప్స్ పేరిట ఆదేశిస్తున్నారు.
ఇలాంటి వాటికి ఒకే ఒక సమాధానం అన్నట్లుగా సూటిగా సుత్తి లేకుండా వైసీపీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యే వెంకటగిరి నియోజకవర్గానికి చెందిన ఆనం రాం నారాయణరెడ్డి కుండబద్ధలు కొట్టారు. పెన్షన్లు ఇస్తే ఓట్లు రాలుతాయా అని ఆయన అతి పెద్ద డౌటే జగన్ ముందు ఉంచారు. . పెన్షన్లు గత ప్రభుత్వంలో లేవా అని కూడా అన్నారు. వారి కంటే వేయి రూపాయలు ఎక్కువ ఇస్తే ఓట్లు మనకు వేసేస్తారా అని ఆయన అంటున్నారు.
ఊళ్ళలోకి వెళ్తే రోడ్లు లేవు కనీసం గుంతలు పూడ్చమన్నా ఆ పని చేయలేకపోయాం, ఇక తాగు నీరు ఏది అంటే కేంద్రం వైపు చూపిస్తున్నారు మన అధికారులు. జల జీవన్ మిషన్ కేంద్రం నిధులు ఇస్తే దాంతో పైప్ లైన్స్ వేస్తామని అంటున్నారు. మరి కేంద్రం నిధులతో తాగు నీరు ఇచ్చి మనం చేసినట్లుగా చెప్పుకోవడం న్యాయమా అని ఆయన ప్రశ్నించారు. అంతే కాదు కేంద్రం నిధులు వస్తాయి అపుడు చేస్తామని అంటే మనని ఎందుకు ఎన్నుకున్నారు. అసలు మనం ఎందుకు అని జనాలు అడిగితే ఏమి జవాబు చెప్పాలని కూడా ఆనం లాజిక్ పాయింటే లాగారు.
ఇళ్ళు కట్టించి ఇస్తామని చెప్పాం, కనీసం ఇళ్ల పట్టాలు లే అవుట్లు కూడా లేకుండా పోయిన పరిస్థితి ఉంది. అలాగే ఎస్ ఎస్ కెనాల్ కి సంబంధించి అప్పట్లో తెలుగుదేశం ప్రభుత్వాన్ని తిట్టామని ఇపుడు మన ప్రభుత్వంలో కనీసం శంకుస్థాపన అయినా చేశామా అని ఆయన గట్టిగానే తగులుకున్నారు. ప్రజలకు నాలుగేళ్ల పాలనలో ఏమీ చేయలేకపోయాం, మళ్లీ గెలవాలంటే మార్గం కూడా కనిపించడంలేదు అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
రావూరులో జరిగిన నియోజకవర్గం స్థాయి సమావేశంలో ఆనం చాలా విషయాలు చెప్పారు. పైగా తాను అన్నీ గ్రౌండ్ లెవెల్ లో ఉన్న వాస్తవాలే చెబుతున్నాను అని ఆయన అంటున్నారు. తన మాటలనే జనాలు నమ్మే
పరిస్థితి లేకుండా పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్ ఇందిరమ్మ ఇళ్ళు కట్టించి ఇచ్చారని నాలుగేళ్లలో మనం ఏమి చేశామని ఆయన డైరెక్ట్ గా జగన్ని అడిగినట్లుగా ఉంది. మొత్తానికి చూస్తే ఆనం మాటలు అన్నీ బయటకు అనేశారు. మిగిలిన ఎమ్మెల్యే తీరు కూడా అలాగే ఉంది వారు బయటపడలేకపోతున్నారు అని అంటున్నారు.
ఇవన్నీ పక్కన పెడితే వచ్చే ఎన్నికల వేళకు ఆనం రామనారాయణరెడ్డి పార్టీ మారుతారు అన్న ప్రచారం ఉంది. ఆయన ఈలోగా వైసీపీ సర్కార్ వైఫల్యాలు ఇలా పార్టీలో ఉంటూనే బయటపెడతారు అని అంటున్నారు. దాదాపుగా ఎనభై శాతం పదవీ కాలం పూర్తి అయింది. ఇపుడు వైసీపీ సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా పోయేది ఏమీ లేదు అని ఆనం లాంటి వారు ఉన్నారు. ఆయన గొంతుతో మరికొందరు శృతి కలిపితే మాత్రం వైసీపీకి అతి పెద్ద ఇబ్బంది అనే అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.