ఎన్నికలు చూస్తే ముంగిట్లోకి వచ్చేశాయి. కొద్ది రొజుల్లో డిసెంబర్ ముగిసి 2023 రాబోతోంది. అంటే తెలంగాణా ఎన్నికల ఏడాదిలోకి అడుగు పెట్టినట్లే. అలాంటపుడు కార్యాచరణ ఎలా ఉండాలి. యుద్ధ భూమికి సిద్ధం కావాల్సిన సైనికుడిగా ఆవేశంతో కదం తొక్కాలి. ప్రత్యర్ధి పని పట్టాలి. కానీ జరుగుతున్నది చూస్తే తెలంగాణా కాంగ్రెస్ లో అలాంటి సన్నివేశాలు ఏవీ కనిపించడంలేదు.
కాంగ్రెస్ కి ఒక కల్చర్ ఉంది. తమలో తాము పోట్లాడుకోవడం. అసలు శతృవుని అలా విడిచిపెట్టడం. అలాగే మరో మాట కూడా ఉంది. అధికారంలో ఉంటే ముఖ్యమంత్రి పదవి కోసం, ప్రతిపక్షంలో ఉంటే పీసీసీ చీఫ్ పదవి కోసం పోటీ పడడం నాయకులకు అలవాటు అని. తెలంగాణా కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయింది 2021 జూన్ లో. ఆయన 2018లోనే పార్టీలో చేరారు. వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేశారు. 2019 ఎన్నికల్లో తన శాయశక్తులా ఆయన కృషి చేశారు.
వర్కౌట్ కాలేదు, కాంగ్రెస్ ఓడింది. ఇక 2021లో అప్పటి పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని తప్పించి రేవంత్ కి కాంగ్రెస్ అధినాయకత్వం చాన్స్ ఇచ్చింది. ఇప్పటికి 19 నెలలు అవుతోంది. కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డిని పనిచేసుకోనిచ్చారా లేక ఆయన చేయలేకపోతున్నారా అన్నది పక్కన పెడితే వర్గ పోరు మరింత పెరిగింది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఒంటెద్దు పోకడలు పోతున్నారు అని సీనియర్లు అంటూంటే తనను వారు దగ్గరకు తీయడం లేదని రేవంత్ భావించవచ్చు.
అసలు తెలంగాణా కాంగ్రెస్ కి ఒక ఇంచార్జి ఉన్నారు. ఆయనే మాణిక్యం ఠాగూర్. ఆయన కాంగ్రెస్ లో అటు పీసీసీని ఇటు సీనియర్ నాయకులను ఏకం చేసి కో ఆర్డినేషన్ కోసం కృషి చేసి ఉండాల్సింది. కానీ ఠాగూర్ కూడా ఆ విధంగా వ్యవహరించడంలో చొరవ చూపింది లేదని అంటున్నారు. అందువల్లనే మొదట నెమ్మదిగా ఉన్న వివాదాలు ఇపుడు చిలికి గాలి వాన అయి ఈ రోజు సీనియర్లు వేరేగా కుంపటి పెట్టుకునే దాకా కధ చేరుకుంది.
ఇక కాంగ్రెస్ లో కమిటీలను నియమించారు. వాటి విషయంలో ఠాగూర్ సీనియర్లతో సంప్రదించి ఉండాల్సింది. అంతే కాదు సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతోనూ మాట్లాడి ఉండాల్సింది. అందరికీ కూర్చోబెట్టి కనుక కమిటీలను వేసి ఉంటే సమస్య ఇంతదాకా వచ్చేది కాదు. మరి ఠాగూర్ ఈ విషయంలో ఎందుకు వన్ సైడెడ్ గా వ్యవహరించారు అన్నది ఎవరికీ తెలియదు కానీ ఆయన మీద అయితే సీనియర్లు గుర్రుమంటున్నారు.
మరో వైపు చూస్తే కాంగ్రెస్ పార్టీ ఈ రోజుకీ బలంగా ఉంది. నాయకులు అంతా కలిస్తే తప్పకుండా తెలంగాణాలో వచ్చే ఎన్నికల్లో మ్యాజిక్ చేసే సత్తా గలిగిన పార్టీ. కాంగ్రెస్ లో అంతా కలసి ముందుకు వస్తే గెలిపించడానికి సిద్ధం అని ఇటీవల జరిగిన హిమాచల్ ఎన్నికలు రుజువు చేశాయి. పక్కనే ఉన్న కర్నాటకలో కాంగ్రెస్ నాయకులు అంతా కలసి వెళ్తున్నారు. తెలంగాణాలో కూడా కాంగ్రెస్ నేతలు కలసి మెలసి ఎన్నికలకు వెళ్తే కచ్చితంగా మంచి ఫలితాలు నమోదు అవుతాయి.
కానీ కాంగ్రెస్ లో ఇపుడు వర్గ పోరు పార్టీ కొంప ముంచుతోంది. రేవంత్ రెడ్డి వద్దు అంటున్న వారు ఎక్కువ మంది ఉన్నారు. అయితే సీనియర్లు గడచిన నాలుగేళ్ళలో తెలంగాణాలో పార్టీ అభివృద్ధి కోసం తాము ఎంతవరకూ పనిచేశామని కూడా ఆలోచించాలి. అలాగే పార్టీలో పదవులు కావాలి పెత్తనం చేయడానికి కావాలి కానీ పార్టీ కోసం జనంలోకి వెళ్ళ్తే ఓపిక తీరిక ఎంతమందికి ఉంది అన్నది కూడా మరో ప్రశ్న. ఆ మాటకు వస్తే తెలంగాణాలో ఏ మాత్రం బలం లేని బీజేపీ తన ఎన్నికల ప్రణాళికను సిద్ధం చేసుకుంటోంది.
ఆ పార్టీ వీలైనంతవరకూ బీయారెస్ నుంచి అధికారాని గుంజుకుందామని చూస్తోంది. మరి ఆ సోయి తెలంగాణాలో బలంగా ఉన్న కాంగ్రెస్ లో లేకపోవడమే విడ్డూరం అంటున్నారు. ఇప్పటికైనా మునిగిపోయినది లేదు, కాంగ్రెస్ హై కమాండ్ అందరికీ పిలిచి మాట్లాడి ఒక్క త్రాటి మీద నడచేలా చేస్తే చూస్తే 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ ఆశలు అలాగే ఉంటాయి. ఇక కాంగ్రెస్ లో ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఒక విషయం మాత్రం స్పష్టం.
పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి ఆకర్షణ శక్తి ఉంది. ఆయన మంచి మాటకారి. ఆయన సభలకు జనాలు వస్తారు. ఆయన్ని ముందు పెట్టి కాంగ్రెస్ అధికారంలోకి తెచ్చుకోవాలి. ఆనక ఎటూ ముఖ్యమంత్రుల కోసం పోటీ పడడం అలవాటే కాబట్టి ఆ పని తరువాత మొదలెట్టవచ్చు. ఇదీ సగటు కాంగ్రెస్ కార్యకర్త కోరుకుంటున్న విషయం. ఇక రేవంత్ రెడ్డి సైడ్ నుంచి చూస్తే తాను ముఖ్యమంత్రి కావాలని అనుకున్నప్పుడు తాను కాంగ్రెస్ లో వచ్చి చేరిన నాయకుడు అయినపుడు అందులో చాలాకాలంగా ఉన్న సీనియర్లను కూడా గౌరవించి కలుపుకుని పోవాలి. ఈ లౌక్యం తెలిసినపుడే రేవంత్ తన కలలను నెరవేర్చుకోగలరు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.