జగనే జనం, జనమే జగన్ అని ఆ పార్టీ నేతలు కీర్తిస్తూంటారు. అయితే అదంతా అధికారంలోకి రాకముందు, పాదయాత్ర సమయంలో. అప్పట్లో జగన్ జనంలోనే నిత్యం ఉండేవారు. కానీ మూడేళ్ళ సీఎం గా జగన్ కేవలం అధికారిక కార్యక్రమాలకే పరిమితం అవుతున్నారు. ఇక ఆయన ఎక్కడకు వెళ్ళినా ముందస్తుగా బందోబస్తు చేస్తున్నారు. కట్టుదిట్టమైన ఏర్పాట్లు కూడా ఉంటాయి.
సీఎం ని కలవడానికి కూడా ఎవరికీ ఏ రకమైన అవకాశం అసలు ఉండడంలేదు. ఇక జగన్ కేవలం పోలీసులను పెట్టించి, పకడ్బంధీ ఏర్పాట్లు చేయించుకుని వాటి మధ్యనే మీటింగులు పెట్టుకుంటున్నారు తప్ప ఆయన జనంలోకి రావడంలేదని విపక్షాలు చాలా కాలంగా ఆరోపణలు చేస్తూ వస్తున్నాయి. అదే విధంగా జగన్ జనాల వద్దకు ఎందుకు రావడం లేదు అని కూడా నిలదీస్తున్నారు.
ప్రజల సమస్యలు వినడానికి ఇష్టం లేకనే ఇలా చేస్తున్నారు అని కొందరు అంటూంటే ప్రజలలోకి వస్తే నిరసనలు ఎదురవుతాయన్న ఆందోళనతోనే జగన్ ఇలా చేస్తున్నారు అని కూడా అంటున్నారు. ఇదిలా ఉంటే ఎక్కడ ఎలా ఉన్నా పులివెందులలో కూడా జగన్ కి జనాలకు మధ్యన బారికేడ్స్ అవసరమా అన్న ప్రశ్నలు వస్తున్నాయి.
ఎందుకంటే జగన్ ఈ నెల 7, 8 తేదీలలో రెండు రోజుల పాటు పులివెందులలో పర్యటిస్తున్నారు. ఆయన పర్యటన సందర్భంగా రోడ్లకు ఇరువైపులా బారికేడ్లను ఏర్పాటు చేస్తూ అధికారులు ప్రజలకు షాక్ ఇచ్చారు. జగన్ కేవలం అధికారిక హోదాలో మాత్రమే వస్తున్నారని, ఆయనని ఎవరూ కలవవద్దు అన్నట్లుగా ఈ బారికేడ్ల ఏర్పాటు ఉందని ఇప్పటికే విపక్షాలు విమర్శలు మొదలెట్టాయి.
జగన్ కి పులివెందుల సొంత గడ్డ. మరి అలాంటి గడ్డలో ఆయన పర్యటించినపుడు సహజంగానే స్థానికులలో ఒక ఉత్సాహం వస్తుంది. తన నేతను కలవాలని సమస్యలు చెప్పుకోవాలని, కానీ జగన్ టూర్ మాత్రం ఈసారి బారికేడ్ల మధ్యన, కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్యన సాగిపోయేలా ఉందని అంటున్నారు.
జనానికి జగన్ కి మధ్య నానాటికీ పెరిగిపోతున్న అంతరానికి ఇదొక నిదర్శనమని కూడా అంటున్నారు. నిజంగా జగన్ సీఎం హోదాలో వచ్చినా ప్రోటోకాల్ నిబంధలను అన్నీ పాటిస్తూ స్థానిక ప్రజలను దగ్గరకు పిలవవచ్చు అని అంటున్నారు. కానీ ఎందుకో అధికారులు మాత్రం అలా చేస్తున్నారు అంటే సొంత గడ్డ మీద కూడా సేం సీనా అని అంతా అంటున్నారు.
ఇక చూస్తే రెండు రోజుల కడప జిల్లా పర్యటనలో ఆంధ్రప్రదేశ్ సెంటర్ ఫర్ అడ్వాన్స్‌డ్ రీసెర్చ్ ఇన్ లైవ్‌స్టాక్ న్యూటెక్ బయోసైన్స్‌కు జగన్ శంకుస్థాపన చేస్తారు. అదే విధంగా వేంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతనంగా నిర్మించిన భవనాలను ప్రారంభిస్తారు. వైఎస్‌ఆర్ మెమోరియల్ పార్కును కూడా ఆయన ప్రారంభించనున్నారు. అలాగే 8వ తేదీన ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద తన తండ్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి జగన్ నివాళులర్పిస్తారు. అనంతరం ఆయన గుంటూరులో జరిగే పార్టీ ప్లీనరీలో పాల్గొంటారు.