ఆంధ్రాలో ద‌త్త పుత్రుడు గోలేంటి

Update: 2022-04-24 04:30 GMT
ఓ రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఆయ‌న. ఓ స్థాయి ఉన్న వ్య‌క్తి ఆయ‌న. ఆయ‌న్ను అంత సింపుల్ గా తీసేయ్య‌లేం. ఆయ‌న్ను అంత‌గా సింపుల్ గా  ప‌క్క‌నుంచేయ్య‌లేం. ఎలా చూసుకున్నా కాస్తో కూస్తో అంద‌రి క‌న్నా ఎక్కువ క‌ష్ట‌ప‌డిన వ్య‌క్తి ఆయ‌న. కానీ ఎందుక‌నో ఆయ‌న స్థాయిన ఆయ‌నే త‌గ్గించుకుంటున్నారు. ఓ విధంగా త‌న‌కు తానే ఓ విల‌న్ గా మారిపోయి ఉన్నారు. ఒప్పుడు హీరో ఎందుకు ఈ త‌ర‌హా రాజ‌కీయాల‌కు అల‌వాటు అయి, కాలానికి అనుగుణంగా మారిపోతున్నారు ?

ఎలా చూసుకున్నా రాజ‌కీయాల్లో క్రేజ్ ఉన్న స్టార్ వాల్యూ ఉన్న లీడ‌ర్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి. అందులో సందేహ‌మే లేదు. అదేరీతిన ఎలా చూసుకున్నా సినిమాల్లో ఇప్ప‌టికీ తిరుగులేని చ‌రిష్మా ఉన్న స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్. ఇద్ద‌రికీ పోలికే లేదు. రెండు వేర్వేరు రంగాల్లో రెండు వేర్వేరు దారుల్లో ఎవ‌రికి వారే హీరోలు.. ఎవ‌రి హ‌వా వారిదే ఎవ‌రి శైలి వారిదే ! ఒక్క మాట‌లో చెప్పాలంటే జ‌గ‌న్ అనుకున్న‌ది చేస్తారు. అందుకు సమ‌యం తీసుకుంటారు సంయ‌మ‌నం పాటిస్తారు.. స‌హ‌నం కూడా పాటిస్తారు.

ప‌వ‌న్ అనుకున్న వెంట‌నే అమ‌లు చేస్తారు. స‌హ‌నం పాటిస్తారు. సంయ‌మ‌నం కూడా పాటిస్తారు.. అవ‌న్నీ అవ‌స‌రం అనుకుంటేనే కానీ అవ‌స‌రం లేద‌నుకుంటే మాత్రం తిరుగుబాటు స్వ‌రం వెంట‌నే వినిపిస్తారు.

జ‌గ‌న్ మాత్రం ఆచితూచి  స్పందిస్తారు. రాజ‌కీయం ప్రకారం నిల‌క‌డ‌గా  రాణించాల‌ని చూస్తారు. ప‌వ‌న్ మాత్రం రాజ‌కీయ అవ‌స‌ర‌త‌లు క‌న్నా ప్ర‌జావ‌స‌రాల‌ను ప‌రిగ‌ణించి, ప్రాధాన్యం ఇచ్చి త‌న‌దైన దాతృత్వం ప్ర‌క‌టించి, బాధిత వ‌ర్గాల‌కు ఎన్నో సార్లు నేరుగా ఆదుకున్నారు. ఇక‌పై కూడా ఆదుకుంటారు. పైన చెప్పుకున్న విధంగా ఎవ‌రికి వారే ! ఎవ‌రి దారి వారిదే ! కానీ జ‌గ‌న్  మాత్రం ఇటీవ‌ల కొన్ని వ్యాఖ్య‌లు చేస్తున్నారు. తెలుగుదేశం అధినేతకు పవన్ ద‌త్త పుత్రుడు  అంటున్నారు. కానీ జ‌గ‌న్ మాట‌ల్లో అర్థ‌మే లేద‌ని ఇంకా పొత్తులే తేల‌నిది ఎందుకిలా నోరుపారేసుకుంటున్నార‌ని వైసీపీ చీఫ్ ను ఉద్దేశించి జ‌న‌సేన వ‌ర్గాలు అంటున్నాయి.

అస‌లు ద‌త్త‌పుత్రుడు అన్న ప‌దం ప‌వ‌న్ విష‌యంలో ఓ అధికార కార్య‌క్ర‌మంలో అన‌వ‌చ్చా. ఓ ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మంలో అన‌వ‌చ్చా.. హుందాత‌నం కోల్పోయి మీడియా  రాత‌ల‌ను ప‌దే ప‌దే ప్ర‌స్తావిస్తే జ‌నం నుంచి సానుభూతి వ‌స్తుందా ? ఇవి కూడా జ‌గ‌న్ ఆలోచించాలి. అందుకే ప‌వ‌న్ రివ‌ర్స్ పంచ్ ఇచ్చి సీబీఐ ద‌త్తుడు జ‌గన్ అని అంటున్నారు.

నిన్న మొన్న‌టి వేళ అనంత దారుల్లో కౌలు రైతు భ‌రోసా యాత్ర సంద‌ర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ప‌శ్చిమ‌గోదావ‌రి వాకిట‌కు ప‌వ‌న్ చేరుకుని మ‌ళ్లీ బాధిత వ‌ర్గాల‌కు అండ‌గా నిలిచి త‌నకు పొలిటిక‌ల్ ఇమేజ్ క‌న్నా ప‌బ్లిక్ కు అండ‌గా ఉండ‌డం ముఖ్య‌మ‌ని చాటారు. ఇప్పుడు ప‌వ‌న్ ప్ర‌జ‌ల‌కు ద‌త్తుడు.. కాదంటారా ? అని ప్ర‌శ్నిస్తోంది జ‌న‌సేన. నేరుగా సాయం చేయ‌డమే లేదు అని మంత్రి కొట్టు స‌త్యనారాయ‌ణ ఎలా వ్యాఖ్యానిస్తారు అని కూడా ప్ర‌శ్నిస్తోంది. ఏదేమ‌యినా ఓ ప్ర‌భుత్వ అధిప‌తిగా జ‌గ‌న్ సంయమ‌నం కోల్పోకూడ‌దు.. అస‌హ‌నం అస్స‌లు పొంద కూడదు .. పొందినా అది ముఖంపై రానివ్వ‌కూడ‌దు మాటల్లో వెల్ల‌డి కానివ్వ‌కూడ‌దు.. అనేక క‌థ‌నాలు రావాలి.. వ‌స్తేనే జ‌గ‌న్ నిజ‌మా..ప‌వ‌న్ అబ‌ద్ధ‌మా ..చంద్ర‌బాబు నిజ‌మా, జ‌గ‌న్ అబద్ధ‌మా అన్న‌ది తేలుతుంది.
Tags:    

Similar News