నెక్ట్స్ అరెస్ట్ ఆ టీడీపీ మాజీ మంత్రే.. లీక్ చేసిన ఏపీ మంత్రి

Update: 2020-07-17 13:00 GMT
గత చంద్రబాబు పాలనలోని అవినీతి అక్రమాలను వెలికి తీస్తూ టీడీపీ మాజీ మంత్రులను అరెస్ట్ చేస్తున్న వైసీపీ ప్రభుత్వం నెక్ట్స్ ఎవరి మీద పడుతుందా అన్న ఆసక్తి రాజకీయ వర్గాల్లో ఉంది. అయితే ఆ ఊహాగానాలకు బలం చేకూరేలా రెండు రోజుల కింద ‘సైకిళ్ల కుంభకోణాన్ని’ తెరపైకి తెచ్చిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి టీడీపీ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పేరును ట్విట్టర్ లో పరోక్షంగా ప్రస్తావించి సంచలనం రేపారు. 12 కోట్ల సైకిళ్ల కొనుగోలులో ఐదుకోట్ల అవినీతి జరిగిందంటూ ఆరోపించారు.

తాజాగా ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే వైసీపీ సర్కార్ అవినీతి చేసిన అచ్చెన్నాయుడు, కొల్లు రవీంధ్రను అరెస్ట్ చేసిందని.. నెక్ట్స్ టార్గెట్ గంటా శ్రీనివాస్ అంటూ నేరుగా వ్యాఖ్యలు చేయడం దుమారం రేపింది. దీంతో టీడీపీలో నెక్ట్స్ టార్గెట్ గంటానే అని అందరికీ అర్థమవుతోందని ఆ పార్టీ నేతలు విమర్శిస్తున్నారు.

మంత్రి అవంతి తాజాగా విశాఖలో మాజీ మంత్రి గంటా అనుచరులు భూఆక్రమణలకు పాల్పడ్డారని ఆరోపించారు. గంటా శ్రీనివాస్ అరెస్ట్ కాకతప్పదు అని వ్యాఖ్యానించారు.

ఇలా వైసీపీలో ఇద్దరు కీలక నేతల వ్యాఖ్యలను బట్టి చూస్తే నెక్స్ట్ గంటా శ్రీనివాసరావు మెడకు ఉచ్చు బిగుస్తోందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
Tags:    

Similar News