ఎల్‌జీ పాలిమర్స్‌ కు రూ. 50 కోట్ల జరిమానా !

Update: 2020-05-08 12:50 GMT
విశాఖ గ్యాస్ లీక్ ప్రమాదంపై ఎల్జీ పాలిమర్స్ సంస్థకు, పర్యావరణ మంత్రిత్వ శాఖకు, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలికి జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) నోటీసులు జారీచేసింది. అలాగే, తక్షణ పరిహారం కింద ముందుగా రూ.50 కోట్లు మధ్యంతర జరిమానాగా జమ చేయాలని ఎల్‌జీ పాలిమర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌ ను ఆదేశించింది.

ఇకపోతే, రసాయన కర్మాగారంలో గురువారం జరిగిన గ్యాస్ లీక్ సంఘటనపై దర్యాప్తు చేయడానికి ఎన్ ‌జిటి చైర్‌ పర్సన్ జస్టిస్ ఆదర్శ్ కుమార్ గోయెల్ నేతృత్వంలోని ధర్మాసనం 5 మంది సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ సభ్యులుగా ఆంధ్ర విశ్వవిద్యాలయం మాజీ వీసీ వి.రామ చంద్రమూర్తి; ఏయూ కెమికల్ ఇంజినీరింగ్‌ విభాగం అధిపతి ప్రొఫెసర్ పులిపాటి కింగ్‌; సీపీసీబీ సభ్య కార్యదర్శి; సీఎస్ ‌ఐఆర్‌ డైరెక్టర్‌, వైజాగ్ ‌లోని నీరి హెడ్‌ ను కమిటీ సభ్యులుగా నియమించింది.

ఈ సంఘటనపై దర్యాప్తు జరిపి మే 18 లోపు నివేదిక సమర్పించాలని కమిటీని ఆదేశించింది. నివేదికను రూపొందించేందుకు.. నిజ నిర్ధారణ బృందానికి అవసరమైన అన్ని సహాయ సహకారాలను విశాఖపట్నం కలెక్టర్‌ అందించాలని కూడా ఎన్జీటీ ఆదేశించిందిఈ ఘటనకు కారణాలు ఏమిటి.. ఎంత మంది మరణించారు. ఎంతమందిపై దీని ప్రభావం ఉంది. పర్యావరణానికి ఎంతమేరకు ముప్పు వాటిల్లింది. జీవరాశులకు జరిగిన నష్టం ఏమిటి. అధికారుల పాత్ర ఎంత. అనే అంశాలను పరిశీలించి నివేదిక సమర్పించాలని ఎన్జీటీ.. కమిటీని కోరింది.
Tags:    

Similar News