తెలంగాణలోని నీటి ప్రాజెక్టులకు గ్రహణం పట్టినట్లుగా కనిపిస్తోంది. కారణాలు ఏవైనా కావొచ్చు గాక.. కానీ, ఏవైతే తెలంగాణకు జీవనాధారం కాగల ప్రాజెక్టులుగా ప్రభుత్వం భావిస్తున్నదో అలాంటివి.. ఎక్కడ తమ పార్టీని బలోపేతం చేసుకోవాలని తెరాస తపన పడుతున్నదో అలాంటి ప్రాజెక్టులు.. అన్నీ ఒక్కటొక్కటిగా ఆగిపోతున్నాయి. ఇవన్నీ ప్రభుత్వానికి ప్రతికూల సంకేతాలుగానే పరిగణించాల్సి ఉంటుంది. అయితే.. ఇలా నీటి ప్రాజెక్టులు ఆగిపోతుండడానికి కొన్ని చంద్రబాబునాయుడు పుణ్యమాని ఆగుతున్న పనులు అయితే.. మరికొన్ని తెరాస సర్కారు స్వయంకృతమైన ద్రోహాలుగా ఉన్నాయని కూడా విశ్లేషకులు భావిస్తున్నారు. తాజాగా ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన అనుమతులు పూర్తిగా తీసుకోకుండా, వాటికోసం ప్రయత్నించకుండా, పట్టించుకోకకుండా సాగిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ఆపేయాలంటూ జాతీయ హరిత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఈ అంశం చర్చకు వస్తోంది.
నీటి ప్రాజెక్టులకు ఇలాంటి అవాంతరాలు రావడం కొత్త విషయం కాదు. ప్రాజెక్టులు పూర్తియతే ఒనగూరే ప్రయోజనాలు ఎలా ఉన్నప్పటికీ.. నిర్మాణం సమయంలో అనేక ఇబ్బందులు అనివార్యంగా ఎదురవుతూనే ఉంటాయి. పాలమూరు జిల్లాకు సాగునీటి వసతులను మెరుగు పరచడానికి కేసీఆర్ సర్కారు ప్లాన్ చేసిన కొన్ని ఎత్తిపోతల ప్రాజెక్టులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి అభ్యంతరాలు వచ్చాయి. వీటి నిర్మాణాలకు సంబంధించి నిబంధనలు పూర్తిస్థాయిలో పాటించకపోయినందునే ఆంధ్రప్రదేశ్ సర్కారు అభ్యంతరాలు వ్యక్తం చేయగలిగింది. కేంద్రానికి ఫిర్యాదు చేసి.. ఈ ప్రాజెక్టు పనులను ఆపు చేయించగలిగింది. ఇదొక సమస్యగా అవి ఆగాయి.
నిజానికి ఎత్తిపోతల ప్రాజెక్టులకు వచ్చిన అవాంతరం కంటె.. కాళేశ్వరం ప్రాజెక్టుకు వచ్చిన అవాంతరం చాలా పెద్దది. కేంద్రం నుంచి ప్రాజెక్టులకు అనుమతులు తీసుకురావడం ఒక పట్టాన తెమిలే వ్యవహారం కాదు. కానీ, ఆ ప్రాజెక్టు మీద కోటి ఆశలతో తెలంగాణ సర్కారు పనులు సాగిస్తోంది. అవికాస్తా కోర్టు ఉత్తర్వులతో ఇప్పుడు ఆగిపోయే పరిస్థితి. కానీ అనుమతుల గురించి పట్టించుకోకుండా పోవడం అనేది కేసీఆర్ సర్కారు స్వయంకృతాపరాధంగానే భావించాలి.
ఆ రకంగా కొన్ని చంద్రబాబునాయుడు ప్రభుత్వ పుణ్యమాని - కొన్ని కేసీఆర్ ప్రభుత్వం పొరబాట్ల వల్లగానీ ప్రాజెక్టులు మాత్రం ఆగిపోతున్నాయి. సాధారణంగా సెంటిమెంట్లను సంపూర్ణంగా విశ్వసించే కేసీఆర్ - ఈ సంకేతాలను ఎలా భావిస్తారు. ఎలా వీటిని అధిగమిస్తారో చూడాలి.