ఎన్ఐఏ అలర్ట్.. ప్రధాని మోదీని చంపుతామంటూ మెయిల్..

Update: 2022-04-01 10:30 GMT
జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అలర్టయింది. ఓ ఆగంతకుడు ఏకంగా ప్రధాని మోదీని హత్య  చేస్తామంటూ ఎన్ఐఏకు మెయిల్‌ కు చేయడం కలకలం రేపింది.దేశంలో విచారణ పరంగా అత్యున్నత సంస్థకే ఇలాంటి మెయిల్ రావడం గమనార్హం. దీంతో ఇది సీరియస్ గా తీసుకోవాల్సిన అంశమైంది.

అయితే, మోదీని హత్య చేస్తామని బెదిరింపు మెయిల్ పంపినవాడే.. దేశవ్యాప్తంగా వేలమందిని హత్య చేసేందుకు కుట్ర పన్నినట్లు పేర్కొన్నాడు.

మరోవైపు ఈ మెయిళ్లన్నీ ఎన్‌ఐఏ ముంబయి బ్రాంచ్‌కు అందాయి. దీంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు.20 స్లీపర్ సెల్స్ పనిచేస్తున్నాయంటూ..

ప్రధానిని హత్య చేసేందుకు 20 మంది స్లీపర్‌ సెల్స్‌ పనిచేస్తున్నారని ఈ-మెయిల్‌లో ఆగంతుకుడు పేర్కొన్నాడు. వారి వద్ద 20 కేజీల ఆర్‌డీఎక్స్‌ ఉందని ఈ-మెయిల్‌లో ప్రస్తావించాడు.

దీని ద్వారా దేశవ్యాప్తంగా వేర్వేరు చోట్ల పేలుళ్లకు కుట్ర పన్నామని, వివిధ ఉగ్రవాద గ్రూపులు దీనికోసం పనిచేస్తున్నాయని ఈ-మెయిల్‌లో ఉన్నట్లు నిఘా వర్గాలు తెలిపాయి. తమకు వచ్చిన ఈ-మెయిల్‌ను ఎన్‌ఐఏ వివిధ ఏజెన్సీలతో పంచుకుంది.

మరోవైపు ఈ-మెయిల్‌ ఏ ఐపీ అడ్రస్‌ నుంచి వచ్చిందో తెలుసుకునేందుకు సైబర్‌ సెక్యూరిటీ విభాగం రంగంలోకి దిగింది.
Tags:    

Similar News