తెలంగాణ‌లో దాడుల‌కు మావోల ప్లానింగ్‌?

Update: 2018-10-08 05:34 GMT
తెలంగాణ రాష్ట్ర ప్ర‌జాప్ర‌తినిధులు ఉలిక్కిప‌డే స‌మాచారం ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. కొంత‌కాలంగా స్త‌బ్దుగా ఉన్న మావోలు ఒక్క‌సారిగా చెల‌రేగిపోవ‌టం.. త‌మ ఉనికిని ప్ర‌ద‌ర్శించ‌ట‌మే కాదు.. ఏపీ అధికార‌పార్టీ ఎమ్మెల్యేను.. మాజీ ఎమ్మెల్యేను పాశ‌వికంగా కాల్చిన వైనం సంచ‌ల‌నంగా మారింది.

కిడారి హ‌త్య నేప‌థ్యంలో.. ఇదే త‌ర‌హాలో తెలంగాణ‌లోనూ దాడుల‌కు పాల్ప‌డాల‌న్న ఉద్దేశంతో మావోలు ఉన్న‌ట్లుగా చెబుతున్నారు. మావోల ఉనికిని ప్ర‌శ్నార్థ‌కంగా చేయ‌టంలోతెలంగాణ ప్ర‌భుత్వం క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించిన నేప‌థ్యంలో.. తెలంగాణ‌లో త‌మ ప‌ట్టును ప్ర‌ద‌ర్శించాల‌ని.. త‌మ ఉనికిపై రాజ‌కీయ ప‌క్షాల్లో వ‌ణుకు తెప్పించాల‌న్న ఆలోచ‌న‌లో మావోలు ఉన్న‌ట్లుగా తెలుస్తోంది.

ఇందుకు సంబంధించిన స‌మాచారం ఇప్పుడు తెలంగాణ పోలీసుల‌కు చేరిన‌ట్లుగా చెబుతున్నారు. ఎన్నిక‌లు ప్ర‌చారం సంద‌ర్భంగా అధికార టీఆర్ఎస్ తో పాటు.. బీజేపీ నేత‌ల్ని టార్గెట్ చేసేలా మావోల ప్లానింగ్ ఉన్న‌ట్లు చెబుతున్నారు. కిడారి ఎపిసోడ్ మాదిరే తెలంగాణ‌లోనూ భారీ ఘ‌ట‌న చేప‌ట్టాల‌న్న ప‌ట్టుద‌ల‌తో మావోలు ఉన్న‌ట్లు చెబుతున్నారు.

దాడుల‌కు సంబంధించిన స‌మాచారం అందుకున్న పోలీసు.. నిఘా విభాగం ఇప్పుడు అలెర్ట్ అయ్యారు. మావో సానుభూతిప‌రుల క‌ద‌లిక‌ల‌పై క‌న్నేయ‌టంతో పాటు.. మావోల ప్రాబ‌ల్యం ఎక్కువ‌గా ఉన్న ప్రాంతాల‌పై ఇప్పుడు ప్ర‌త్యేక దృష్టి సారించిన‌ట్లు తెలుస్తోంది.

మావోల ప‌ట్టు ఉంద‌ని భావిస్తున్న భద్రాది-కొత్తగూడెం - జయశంకర్‌-భూపాలపల్లి - కుమ్రంభీం - ఆదిలాబాద్‌ - ఆసిఫాబాద్‌ - మంచిర్యాల జిల్లాల ఎస్పీల‌ను అప్ర‌మ‌త్తంగా ఉండాల‌న్న ఆదేశాల్ని జారీ చేసిన‌ట్లుగా తెలుస్తోంది. ఎన్నిక‌ల నేప‌థ్యంలో ప్ర‌చారంతో పాటు.. ఇత‌ర కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించేందుకు అధికార టీఆర్ ఎస్‌.. బీజేపీ నేత‌లు  చేసే ప‌ర్య‌ట‌న‌ల‌కు భారీ ఎత్తున బందోబ‌స్తు ఏర్పాటు చేయ‌టంతోపాటు.. దాడుల‌కు అవ‌కాశం ఇవ్వ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని ఆదేశాలు జారీ చేసిన‌ట్లు స‌మాచారం. నేత‌లు ఎవ‌రూ ముంద‌స్తు స‌మాచారం ఇవ్వ‌కుండా ఏజెన్సీ ప్రాంతాల్లోకి వెళ్ల‌కూడ‌ద‌న్న విష‌యాన్ని వారికి అర్థ‌మ‌య్యేలా పోటీసులు చెప్పాలంటూ పోలీసు ఉన్న‌తాధికారుల నుంచి సందేశాలు వ‌చ్చిన‌ట్లుగా చెబుతున్నారు. కీల‌క‌మైన ఎన్నిక‌ల వేళ‌.. త‌మ‌కు న‌చ్చిన‌ట్లుగా తిరిగే వీల్లేని వైనం రానున్న రోజుల్లో టీఆర్ఎస్‌.. బీజేపీ నేత‌ల‌కు ఇబ్బందిగా మారటం ఖాయ‌మంటున్నారు.
Tags:    

Similar News