హైదరాబాద్లో మరో ఐసిస్ పిశాచిని పట్టుకున్నారు

Update: 2016-07-08 12:51 GMT
గడిచిన కొద్ది రోజులుగా వరుసగా ఏదో ఒక దేశంలో ఉగ్రవాద దాడులు జరుగుతున్నాయి. ఒకటి తర్వాత ఒకటిగా జరుగుతున్న దాడుల కారణంగా ప్రాణనష్టం భారీగా ఉంటోంది. ఉగ్రవాదులు వేసిన ప్లాన్ పారని ప్రాంతం ఏదైనా ఉందా? అంటే అది భారతదేశమేనని చెప్పాలి. వాస్తవానికి వారం.. పది రోజుల క్రితం హైదరాబాద్ మహా నగరంలో భారీ విద్వంసకాండకు ఐసిస్ సానుభూతిపరులు ప్లాన్ చేయటం.. దాన్ని గుర్తించిన జాతీయ దర్యాప్తు సంస్థ.. హైదరాబాద్ పోలీసులతో కలిసి కుట్రకు ప్లాన్ చేసిన వారిని అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.

వారిని విచారిస్తూ.. కుట్రకు సంబంధించిన పలు విషయాల్ని పోలీసులు సమాచారం సేకరిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా హైదరాబాద్ లోని సంతోష్ నగర్ ప్రాంతంలో ఐసిస్ ఉగ్రవాద సంస్థకు చెందిన సానుభూతి పరుడ్ని అదుపులోకి తీసుకోవటంతో ఒక్కసారి ఉలిక్కిపడే పరిస్థితి.  పోలీసులు అదుపులోకి తీసుకున్న ఐసిస్ సానుభూతిపరుడ్ని ఈదీబజార్ కు చెందిన నిజాముద్దీన్ గా గుర్తించారు.

తాజాగా అదుపులోకి తీసుకున్న నిజాముద్దీన్ ను జాతీయ దర్యాప్తు సంస్థ కార్యాలయానికి తరలించారు. ఐసిస్ సానుభూతిపరులుగా భావిస్తున్న వారు ఒకరి తర్వాత ఒకరుగా పోలసులు అదుపులోకి తీసుకుంటున్న వైనం చూస్తే.. ఐసిస్ పిశాచులు హైదరాబాద్ మీద కన్నేసినట్లుగా కనిపిస్తుందని చెప్పకతప్పదు.
Tags:    

Similar News