కేరళలో జరిగిన బంగారం కుంభకోణంలో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ కుంభకోణం దేశవ్యాప్తంగా సంచలనమైన విషయం తెలిసిందే. ఈ కుంభకోణంలో ఉన్న వారందరినీ ఎన్‌ఐఏ విచారణ చేస్తోంది. ఈ కేసులో జాతీయ దర్యాప్తు బృందం (నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ) దూకుడు పెంచింది. ఈ కేసులో ఉన్న ప్రధాన నిందితులు స్వప్నా సురేశ్, సందీప్ నాయర్ ను ఇప్పటికే అరెస్ట్ చేసి విచారించారు. ఈ క్రమంలోనే ఈ కుంభకోణంలో పాత్ర ఉందని అనుమానిస్తున్న ముఖ్యమంత్రి మాజీ ముఖ్య కార్యదర్శి శివశంకర్‌ని కూడా ఎన్ఐఏ ప్రశ్నిస్తోంది. ఈ సందర్భంగా విచారణ క్రమంలో అతడి నుంచి కొన్ని వివరాలు సేకరించినట్టు తెలుస్తోంది.
బంగారం స్మగ్లింగ్ వెనుక ఉన్నతస్థాయి అధికారుల పాత్రపై ఎన్ఐఏ ఆరా తీసినట్లు సమాచారం. గోల్డ్ హవాలాలో నగదు చెల్లింపులు హైదరాబాద్ లో జరిగినట్లు కష్టమ్స్ అధికారులు గుర్తించారు. ఆ హవాలా డబ్బును హైదరాబాద్ నుంచి దుబాయ్ కి తరలించినట్లు ఆధారాలు లభించడంతో ఈ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఈనెల 11వ తేదీన ప్రధాన నిందితురాలు స్వప్న సురేశ్‌ను.. సందీప్ నాయర్ అరెస్ట్ చేశారు. వీరు తిరువనంతపురంలోని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) కాన్సులేట్‌కు చెందిన పార్శిల్‌లో రూ.15 కోట్ల విలువైన 30 కిలోల బంగారాన్ని జులై 4వ తేదీన విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.
కాన్సులేట్‌కు సంబంధించిన పార్శిల్లో భారీగా బంగారం పట్టుబడటం కేరళలో కలకలం సృష్టించింది. ఈ కేసును ఎన్ఐఏ విచారణ చేస్తోంది. ఈ వ్యవహారంలో యూఏఈ కాన్సులేట్ ఉద్యోగితో పాటు కేరళ ప్రభుత్వ ఐటీ శాఖలో పనిచేస్తున్న స్వప్న సురేశ్.. కేరళ సీఎం కార్యాలయ ప్రధాన కార్యదర్శి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అందులో భాగంగాగనే వారిని విచారిస్తున్నారు.