తమకు పట్టుబడకుండా తప్పించుకు తిరుగుతున్న మావోయిస్టు అగ్ర నేతలను పట్టుకోవడానికి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) వ్యూహం మార్చింది. తెలంగాణకు చెందిన పలువురు మావోయిస్టు పార్టీ అగ్రనేతలపై భారీగా రివార్డులు ప్రకటించింది. ఎవరైనా వీరి సమాచారం ఇచ్చినా, ఆచూకీ చెప్పినా, పట్టించినా భారీగా నగదును అందజేయనుంది.
తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒడిశా, జార్ఖండ్, అస్సాం తదితర రాష్ట్రాల్లో పనిచేస్తూ వివిధ కేసులు నమోదైన మావోయిస్టులను ఎన్‌ఐఏ ఈ జాబితాలో చేర్చింది. దేశవ్యాప్తంగా సుమారు 106 మంది పేర్లు ఈ జాబితాలో ఉన్నారు.
2013లో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం జీరంఘాటి ప్రాంతంలో సల్వాజుడుం అధినేత మహేంద్రకర్మ సహా 27 మందిని హత్యచేసిన ఘటనలో 156 మందిని నిందితులుగా పేర్కొన్నప్పటికీ ఎన్ఐఏ 21 మందిని హిట్‌లిస్ట్‌లో చేర్చింది. ఇందులో 14 మంది తెలంగాణకు చెందిన మావోయిస్టు అగ్రనేతలు ఉన్నారు.
కాగా, రెండేళ్ల తర్వాత మావోయిస్టు నేతలపై ఎన్‌ఐఏ భారీగా రివార్డులు ప్రకటించడం సంచలనం సృష్టిస్తోంది. దేశంలోని 11 రాష్ట్రాలు, 73 జిల్లాల్లో మావోయిస్టు పార్టీ ప్రాబల్యం ఉందన్న ఎన్‌ఐఏ పలువురిపై నజరానాను పెంచింది.
ఇప్పటికే కేంద్రకమిటీ మాజీ కార్యదర్శి ముప్పాళ్ల లక్ష్మణ్‌రావు అలియాస్ గణపతిపై రూ.2.52 కోట్లు రివార్డు ఉండగా తాజాగా ఆయనపై మరో రూ.50 లక్షలు పెంచింది. అంటే ఆయన ఆచూకీ చెప్పినవారికి రూ.3 కోట్లు విరాళమివ్వనుంది.
కేంద్ర కమిటీ కార్యదర్శిగా ఉన్న నంబళ్ల కేశవరావు అలియాస్ బస్వరాజ్‌పై రూ.50 లక్షలు ప్రకటించడంతో మొత్తంగా రూ.కోటికి చేరింది. కేంద్ర కమిటీ సభ్యులు కటకం సుదర్శన్ అలియాస్ మోహన్, మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ లక్ష్మణ్న, ప్రశాంత్ బోస్ అలియాస్ కిసాన్ దా, మల్ల రాజిరెడ్డి అలియాస్ సత్తన్న, కె.సత్యనారాయణ రెడ్డి అలియాస్ కోసా, తిప్పిరి తిరుపతి అలియాస్ చేతన్, మోడం బాలకృష్ణ, గాజర్ల రవి అలియాస్ ఉదయ్, పాక హన్మంతు అలియాస్ ఊకే గణేష్ తదితర 21 మందిపై రూ.7 లక్షల నుంచి రూ.కోటి వరకు రివార్డులు పెంచారు.