సుమలతపై ఓడాక నిఖిల్ ఏమన్నారంటే.?

Update: 2019-05-31 05:56 GMT
దేశం మొత్తం ఆకర్షించిన ఎన్నిక ఇదీ.. ఆ నియోజకవర్గంలో సీఎం కొడుకు బరిలో ఉన్నారు. ఆయనపై పోటీచేసింది సీనియర్ నటి.. పైగా ఇండిపెండెంట్ గా.. కన్నడ సీఎం కుమారస్వామి సహా అందరూ ఫోకస్ చేసి శతవిధాలా ప్రయత్నించినా వల్ల కాలేదు. కేవలం ఒక్క మహిళా.. ఒంటరిగా పోరాడింది. సీఎంనే ఎదురించి గెలిచింది.

దేశంలోనే అత్యంత ఉత్కంఠగా సాగిన ఈ లోక్ సభ ఎన్నికల్లో మొదటి సారి పోటీపడ్డా జేడీయూ అధినేత, కర్ణాటక సీఎం కుమారస్వామి కుమారుడు నిఖిల్ దారుణంగా ఓడిపోయారు. సుమలత ఆయనను ఓడించింది. అయితే ఓటమి ఎదురైనప్పటి నుంచి మీడియా ముందుకు రాని నిఖిల్.. తాజాగా తొలిసారి స్పందించాడు. తన ఓటమికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జేడీఎస్ నాయకులు, కార్యకర్తలు కారణం కాదని తెలిపాడు. ఈ మేరకు ట్విట్టర్ లో పేర్కొన్నారు.

తాజాగా తన ఓటమికి తానే కారణమని సోషల్ మీడియాలో పేర్కొన్నాడు నిఖిల్. భవిష్యత్ లో మాండ్యా జిల్లాతోపాటు రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి ప్రజల కష్టాలను తెలుసుకొని వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.

ఇక చివర్లో మాండ్యా నుంచి గెలిచిన ఎంపీ  - స్వతంత్ర అభ్యర్థి సుమలతకు అభినందనలు తెలిపారు. అదేవిధంగా అభిషేక్ గౌడ నటించిన అమర్ సినిమా విజయవంతం కావాలని ట్విట్టర్ లో ఆకాంక్షించారు. నిఖిల్ ఓడిపోయినా ఎంతో స్ఫూర్తిగా ట్వీట్ చేయడంపై అభిమానులు
Tags:    

Similar News