జగన్ కేసుల నుంచి తొలగించాలని కోర్టుకెక్కిన నిమ్మగడ్డ

Update: 2021-11-26 11:30 GMT
వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సంబంధించిన అక్రమాస్తుల కేసు విచారణ కొనసాగుతూనే ఉంది. వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసుతో సంబంధం ఉన్న వివిధ రంగాల ప్రముఖులపై తెలంగాణ హైకోర్టులో విచారణ సాగుతోంది. తాజాగా ఈ కేసు నుంచి తన పేరు తొలగించాలని పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటీషన్ దాఖలు చేశారు. భూసేకరణ కోసం ప్రభుత్వానికి సహకరించాలన్న ఒప్పందం మేరకు.. రైతులకు తాము నగదు చెల్లించినట్టు తెలిపారు.

ఈ పిటీషన్ పై శనివారం వాదనలు కొనసాగనున్నాయి. వైసీపీ అధ్యక్షుడు జగన్ కంపెనీల్లో పెట్టుబడి పెట్టినందుకు.. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సర్కార్ నుంచి అయాచిత ప్రయోజనాలు పొందలేదని పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ కోర్టుకు తెలిపారు. జగన్ అక్రమాస్తుల కేసు నుంచి తనపేరు తొలగించాలని కోర్టును కోరారు.

నిమ్మగడ్డ పిటీషన్ పై హైకోర్టులో విచారణ సాగింది. ఉచితంగా పొందితే ప్రయోజనాలు పొందినట్లు అవుతుంది కానీ.. తాము వాన్ పిక్ ప్రాజెక్ట్ కోసం 13 ఎకరాల భూమి కొనుగోలు చేశామని నిమ్మగడ్డ వివరించారు. భూసేకరణ కోసం ప్రభుత్వానికి సహకరించాలన్న ఒప్పందం మేరకు రైతులకు తాము నగదు చెల్లించినట్టు తెలిపారు.

రైతులకు నగదు ఇచ్చేందుకు బ్యాంకు నుంచి డబ్బు డ్రా చేస్తే నిధులు మళ్లించారని సీబీఐ ఆరోపిస్తోందని నిమ్మగడ్డ వాదించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరకంటే ఎక్కువగా చెల్లించామని నిమ్మగడ్డ తెలిపారు. ప్రాజెక్టును బూట్ పద్ధతిలో నిర్వహించాలని అవగాహన ఒప్పందంలో ఎక్కడా లేదని నిమ్మగడ్డ ప్రసాద్ హైకోర్టులో వాదించారు.

వాన్ పిక్ ప్రాజెక్టులపై ప్రభుత్వం కానీ.. రాక్ కానీ ఎలాంటి ఫిర్యాదూ చేయలేదన్నారు. ఈ పిటీషన్ పై శనివారం కూడా వాదనలు కొనసాగనున్నాయి.


Tags:    

Similar News