ఎన్నికల అధికారులపై ఇటీవల ఏపీ మంత్రి పెద్దిరెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కౌంటర్ ఇచ్చారు. ఎన్నికల విధుల్లోని అధికారులపై ఈసీ అనుమతి లేకుండా చర్యలు తీసుకునే అధికారం ఎవరికి లేదని స్పష్టం చేశారు.
ఉద్యోగులు ఎవరూ భయపడవద్దని.. ఏపీ మంత్రుల దూకుడు చర్యలకు.. బెదిరింపు ప్రకటనలకు బెదరవద్దని ఉద్యోగులకు నిమ్మగడ్డ సూచించారు.
ఇటీవలే ఎస్ఈసీ నిమ్మగడ్డ చెప్పినట్టు నడుచుకునే అధికారులను ఉపేక్షించమని.. వారిపై చర్యలు ఉంటాయని ఏపీ మంత్రి పెద్దిరెడ్డి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపైనే ఎస్ ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కౌంటర్ ఇచ్చారు. మంత్రుల బెదిరింపులకు ఉద్యోగులకు భయపడవద్దని.. నేనున్నానని భరోసానిచ్చారు.
కాగా కరోనా నేపథ్యంలో పంచాయతీ ఎన్నికల సమయాన్ని పెంచారు. ఉదయం 6.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు సమాయాన్ని పొడిగించారు.