ఆ మ‌హిళ‌ల‌పై హోంమంత్రి మండిప‌డ్డారు

Update: 2017-06-21 10:12 GMT
ఏపీ హోంమంత్రి - ఉప‌ముఖ్య‌మంత్రి నిమ్మ‌కాయ‌ల చిన‌రాజ‌ప్ప ప‌లువురు మ‌హిళ‌ల విష‌యంలో వ్య‌వ‌హ‌రించిన తీరు వివాద‌స్ప‌దంగా మారింది. తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం మండలం రాయభూపాలపట్నం గ్రామంలో ప‌ర్య‌టిస్తున్న సంద‌ర్భంగా ప‌లువురు మ‌హిళ‌లపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. త‌మ మాట విన‌కుంటే పించ‌న్లు క‌ట్ చేయించేస్తాన‌ని చిన‌రాజ‌ప్ప‌ హెచ్చ‌రిక జారీ చేశారు. దీంతో స‌ద‌రు గ్రామీణ‌ మ‌హిళ‌లు షాక్ తిన్నారు.

ప‌లు అభివృద్ధి ప‌నుల్లో పాల్గొనేందుకు ఉప‌ముఖ్య‌మంత్రి చిన‌రాజ‌ప్ప రాయ‌భూపాల‌ప‌ట్నంకు రాత్రివేళ వ‌చ్చారు. ఈ క్ర‌మంలో ప‌లువురు మ‌హిళ‌లు త‌మ గ్రామంలోని స‌మ‌స్య‌లు సుదీర్ఘ కాలంగా పెండింగ్‌ లో ఉన్న నేప‌థ్యంలో హోం మంత్రికి చెప్పుకొనేందుకు సిద్ధ‌మ‌య్యారు. అయితే ఈ క్ర‌మంలో చిన‌రాజ‌ప్ప ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అభివృద్ధి ప‌నుల‌కు స‌హ‌క‌రించాల‌ని స్ప‌ష్టం చేశారు. తాము రేష‌న్ - పింఛ‌న్లు ఇస్తుంటే వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తారా? అని ప్ర‌శ్నించారు. రేష‌న్ కార్డులు - పింఛ‌న్లు తొల‌గిస్తే రోడ్డుపై ప‌డాల్సి వ‌స్తుంద‌ని హెచ్చ‌రించారు. కాగా, ఉప‌ముఖ్య‌మంత్రి రాజ‌ప్ప ఆగ్ర‌హంతో అవాక్క‌వ‌డం గ్రామీణుల వంతు అయింది. పైగా, విప‌క్ష వైసీపీకి మ‌ద్ద‌తు ప‌లుకుతారా అంటూ ప్ర‌శ్నించ‌డం ఆస‌క్తిక‌రంగా ఉందంటున్నారు.

Full View

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News