ఒకదానికి మరొకటి తీసిపోనట్లుగా ఉండే నవరత్నాల మాదిరే అమరావతి మహానగరంలో తొమ్మిది నగరాల్ని ఏర్పాటు చేస్తున్నారు. వ్యూహాత్మకంగా.. మహానగరి అవసరాలన్నింటిని తీర్చేలా వీటిని రూపొందించనున్నారు. ఈ నగర సముదాయంతో అమరావతి పరిపూర్ణత కలిగిన మహానగరంగా ఉండటమే కాదు.. ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా.. అందరికి అందుబాటులో ఉండేలా వీటి నిర్మాణం జగరనుండటం విశేషం. అమరావతిలో ఏర్పాటు చేసే నవరత్నాల్లాంటి తొమ్మిది నగరాలు ఏంటి? అవి ఎలా ఉంటాయి? ఎక్కడ ఉంటాయి? వాటికి ప్రత్యేకలు చూస్తే..
1. సర్కారీ సిటీ (స్ఫూర్తి; కజకస్థాన్ లోని అస్తానా.. గుజరాత్ లోని గాంధీ నగర్)
అమరావతి మహానగరానికే కాదు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తానికి ఇదే కీలక నగరం. పరిపాలనకు కేంద్రం ఈ నగరం. సచివాలయం మొదలు కొని.. అసెంబ్లీ వరకూ అన్ని ఇక్కడే ఉంటాయి. రాయపూడి.. లింగాయపాలెంలల సర్కారీ సిటీ నిర్మితమవుతుంది. 1430 హెక్టార్లలో విస్తరించి ఉండే ఈ నగరాన్ని వాస్తుకు తగ్గట్లు ఉత్తర.. దక్షిణ అక్షాంశాల మధ్యన దీన్ని నిర్మించాలని భావిస్తున్నారు.
2. న్యాయ నగరం (స్ఫూర్తి; న్యూయార్క్ కాన్ బెర్రా సిటీ సెంటర్)
నేలపాడు.. కృష్ణాయపాలెంలో ఉండే ఈ నగరం.. సర్కారీ నగరానికి దక్షిణాన ఉంటుంది. 1477 హెక్టార్లలో నిర్మించే ఈ నగరంలో నిర్మాణాలు మాత్రం కేవలం 566 హెక్టార్లలో మాత్రమే ఉంటాయి. హైకోర్టు మొదలు దాదాపు అన్ని న్యాయాలయాలు ఇక్కడే కొలువు తీరుతాయి. పచ్చటి ప్రకృతి చెంతన న్యాయ నగరం విరసిల్లనుంది.
3. ఫైనాన్స్ సిటీ (స్ఫూర్తి; హాంకాంగ్ బిజినెస్ డిస్ట్రిక్ట్)
ఏ రాష్ట్రానికైనా.. మహానగరికి అయినా ఆర్థికమే అంతా ప్రభావితం చేస్తుంది. అందుకే.. రాష్ట్రానికి.. రాజధాని మహానగరికి ఫైనాన్స్ క్యాపిటల్ గా ఫైనాన్స్ సిటీని ఏర్పాటు చేయనున్నారు. దీన్ మందడం.. వెలగపూడి.. ఉద్దండరాయని పాలెంలో ఏర్పాటు చేయనున్నారు. ప్రాథమిక వాణిజ్య భవనాలు మొదలుకొని.. వ్యాపార సముదాయాలు ఇక్కడే ఉండనున్నాయి. ఈ నగరంలోనే రెండు మెట్రో రైళ్లు వస్తాయి. వాటర్ ఫ్రంట్ ప్లాజా.. రిక్రియేషన ఐలాండ్ ఈ నగరికి ప్రధాన ఆకర్షణగా చెప్పొచ్చు.
4. టెక్నాలజీ సిటీ (స్ఫూర్తి; దోహా ఎడ్యుకేషన్ సిటీ.. గ్రేటర్ నోయిడా నాలెడ్జ్ సిటీ)
1445 హెక్టార్లలో నిర్మించే ఈ నగరం న్యాయ.. ఆర్థిక నగరాలకు దక్షిణ దిక్కులో ఈ టెక్నాలజీ సిటీ ఉండనుంది. ఇందులో విశ్వవిద్యాలయాలు.. వాటి సిబ్బంది ఇళ్లు ఉండనున్నాయి. ఐనవోలు.. నీరుకొండ.. తుళ్లూరులలో ఈ నగరం రూపుదిద్దుకోనుంది.
5. ఎలక్ట్రానిక్ సిటీ (స్ఫూర్తి; సింగపూర్ వన్ నార్త్.. బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ)
కురగల్లు.. నిడమర్రు గ్రామాల్లో ఏర్పాటు చేయనున్న ఈ ఎలక్ట్రానిక్ సిటీ మొత్తంగా 731 హెక్టార్లలో వ్యాపించి ఉంటుంది. అమరావతికి దక్షిణ దిక్కులో ఈ నగరాన్ని ఏర్పాటు చేయనున్నారు.
6. హెల్త్ సిటీ (స్ఫూర్తి; దుబాయ్ హెల్త్ కేర్ సిటీ.. సింగపూర్ నోవెనా హెల్త్ సిటీ)
కృష్ణయ్యపాలెం.. పెనుమాక.. నవులూరు గ్రామాలే కేంద్రంగా ఆరోగ్య నగరాన్ని ఏర్పాటు చేస్తారు. పెద్ద పెద్ద ఆసుపత్రులు.. అందుకు సంబంధించిన ఏర్పాట్లు ఈ నగరంలో ఉంటాయి. అందరికి ఆరోగ్యం అన్న నినాదంతో ఈ నగరాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ నగరాన్ని 1349 హెక్టార్ల విస్తీర్ణంలో రూపొందించనున్నారు.
7. స్పోర్ట్స్ సిటీ (స్ఫూర్తి; లండన్ క్వీన్ ఎలిజిబెత్ ఒలింపిక్ పార్క్.. మెల్ బోర్న్ ఒలింపిక్ పార్క్)
భారీ స్టేడియాలు.. క్రీడా సంబంధమైన అంశాలకు నెలవుగా ఈ నగరి ఏర్పాటు ఉంటుంది. మొత్తం 650 హెక్టార్లలో ఏర్పాటు చేసే ఈ నగరం పిచుకులపాలెం.. దొండపాడు.. అబ్బరాజుపాలెం.. బోరుపాలెంలో ఏర్పాటు చేయనున్నారు. కృష్ణానదికి అభిముఖంగా ఉండే ఈ స్పోర్ట్స్ సిటీ.. నదికి వాయువ్య దిక్కులో ఉండనుంది.
8. టూరిస్ట్ సిటీ (స్ఫూర్తి;సింగపూర్ సెంటోజా ఐలాండ్.. స్టాక్ హోం సిటీ సెంటర్)
అమరావతి సీనరీ ఎంత అందంగా ఉంటుందన్నది ఈ మధ్యన అయుత చండీయాగానికి ఆహ్వానించేందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి వెళ్లినప్పుడు చూశాం. నదికి దగ్గరగా ఉండే సీఎం నివాసం.. చుట్టూ పరుచుకున్న పచ్చదనంతో.. హెలికాఫ్టర్ కోసం వయిట్ చేసే సందర్భంగా టీవీ కెమేరాలు.. ప్రకృతి అందాల్ని చూపించటం తెలిసిందే. ఇందుకు ఏ మాత్రం తగ్గని రీతిలో టూరిస్ట్ సిటీ ఉండనుంది. కృష్ణా నదీతీరం.. కొండవీడు వాగు వెంట పర్యాటక నగరి వెలువనుంది. వాటర్ ఫ్రంట్.. ఐలాండ్ లు స్పెషల్ అట్రాక్షన్ గా ఉండనున్నాయి. 4745 హెక్టార్లలో ఈ నగరాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఉండవల్లి.. తాడేపలల్ గ్రామంలోని కొంత భాగం ఈ నగరం కిందకు వస్తుంది.
9. మీడియా సిటీ (స్ఫూర్తి; సియోల్ డిజిటల్ మీడియా సిటీ.. యూకేలోని మాంచెస్టర్ మీడియా సిటీ)
అనంతవరం.. నెక్కల్లు గ్రామాల పరిధిలో ఏర్పాటు చేయనున్న మీడియా సిటీ కోసం మొత్తం 1980 హెక్టార్లను కేటాయించారు. ఇందులో 677 హెక్టార్లలో నిర్మాణాలు ఉంటాయి. మొత్తం 2.54 లక్షల మందికి నివాసం ఇక్కడ ఏర్పాటు చేస్తారు.