నిర్భయ దోషులకు ఉరి : ఢిల్లీ వాసుల కొత్త డిమాండ్..కేంద్రం స్పందిస్తుందా?
నిర్భయ ఘటన ...ఈ ఘటన గురించి తెలియని , వినని భారతీయుడు అంటూ ఉండరు. ఈ ఘటన జరిగి ఏడేళ్లు గడుస్తున్నా కూడా ఇంకా అందరి నోట్లో నానుతూనే ఉంది. దీనికి కారణం దేశ రాజధాని అయినా ఢిల్లీలో పారామెడికల్ విద్యార్థిని నిర్భయపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన కేసులో మొత్తం నలుగురిని తీహార్ కేంద్ర కారాగారంలో ఉంచి కేసు విచారించడం. ఈ ఘటన లో వారు దోషులుగా తేలినప్పటికీ ..శిక్ష అమలుకు చాలా సమయం పట్టింది. అనేకమార్లు అనేక మలుపులు తిరుగుతున్న ఈ కేసుకు నేటితో ఉరి కంబాన్నిఎక్కించడంతో ఈ కేసుకి తెరపడింది.
ఈ తెల్లవారు జామున సరిగ్గా 5:32 నిమిషాలకు నిర్భయ దోషులు అక్షయ్ కుమార్ సింగ్ - వినయ్ కుమార్ శర్మ - పవన్ కుమార్ గుప్తా - ముఖేష్ కుమార్ సింగ్ ఉరికొయ్యలకు వేలాడారు. వారిని ఉరి తీశారనే వార్తను తెలుసుకున్న వెంటనే ఢిల్లీ ప్రజలు పెద్ద సంఖ్యలో తీహార్ కేంద్ర కారాగారానికి చేరుకున్నారు. వందలాది మంది గుమికూడారు. నిర్భయకు న్యాయం దక్కిందంటూ హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. నిర్భయ జిందాబాద్.. అంటూ నినదించారు. ప్రాణాంతక కరోనా వైరస్ విస్తరిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో దాన్ని ఢిల్లీవాసులు లెక్క చేయలేదు.
కాకపోతే నిర్భయ దోషులకు ఉరి శిక్షని అమలు చేసిన కొన్ని నిమిషాల వ్యవధిలో మరో కొత్త డిమాండ్ కు తెర లేచింది. నిర్భయ కుటుంబ సభ్యులు - ఢిల్లీ ప్రజలు ఈ డిమాండ్ ను లేవనెత్తారు. ఈ డిమాండ్ తో తీహార్ జైలు ఎదురుగా ప్లకార్డులను సైతం ప్రదర్శించారు. అయితే వారు లేవనెత్తిన డిమాండ్ పట్ల కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అసలు ఆ డిమాండ్ ఏమి అంటే న్యాయ దివస్. నిర్భయ దోషులను ఉరి తీసిన మార్చి 20వ తేదీని న్యాయ దివస్ గా ప్రకటించాలని ఢిల్లీ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఏడేళ్ల తరువాత నిర్భయకు న్యాయం దక్కిందని, దీన్ని చిరస్మరణీయంగా మార్చాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. ఇకపై అమ్మాయిలపై అఘాయిత్యాలకు పాల్పడాలంటేనే భయంతో వణికిపోయేలా ఈ ఉరిశిక్ష మిగిలిపోవాలని అంటున్నారు. ఈ కారణం గానే ఈ ఉరిశిక్షను అమలు చేసిన రోజును న్యాయ దివస్ గా ప్రకటించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై కేంద్రం ఏ విదంగా స్పందిస్తుందో మరి.