నిర్భయ దోషులకు త్వరలో ఉరి ..ఇన్ని రోజులు ఎందుకు ఉంచారంటే

Update: 2019-11-01 05:19 GMT
ప్రభుత్వం చేసే కొన్ని పనుల ద్వారా ఈ సమాజంలో నేరాలు చేసే వారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. ఇతర దేశాలలో మాదిరి మన దేశంలో కూడా తప్పు చేసిన వారిని .. అక్కడిక్కడడే నడి రోడ్డుపై ఉరి తీస్తే మరోసారి అలాంటి ఘోరాలు చేయాలన్న భయపడతారు. కానీ ,మన చట్టాలు అందుకు ఒప్పుకోవు. దీనితో నేరం రుజువైనా కూడా ఏళ్ల తరబడి జేలు జీవితం గడుపుతూ హాయిగా ఉంటున్నారు. నలుగురికి ప్రేరణగా మారుతున్నారు. ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా ..16 డిసెంబర్ 2012 న భారత రాజధాని ఢిల్లీలో ఒక వైద్యవిద్యార్థినిని కదులుతున్న బస్సులో ఆరుగురు కర్కశంగా, దారుణంగా ఇనుప కడ్డీతో కొట్టి అత్యాచారం చేశారు. ఆమె పేరే నిర్భయ .. ఈ విషయం పై దేశం మొత్తం ఒక్కట్టై ఆమెకి మద్దతుగా నిలిచారు. ప్రభుత్వం ఆమె పేరు మీద చట్టాన్ని అయితే తీసుకురాగలిగింది. కానీ , ఆమె పై అత్యాచారం చేసిన వారికీ మాత్రం శిక్షని అమలు చేయలేకపోయింది. వారు ఇప్పటికి కూడా ఇంకా జైల్లో విలాసవంతమైన జీవితం గడుపుతున్నారు.

ఇకపోతే   కేసులో నలుగురు దోషులకు విధించిన ఉరిశిక్షను త్వరలోనే అమలుచేస్తామని తీహార్ జైలు అధికారులు తెలిపారు. దొంగలు పడ్డ ఆరునెలలకి కుక్కలు మొరగడం అంటే ..వారు ఆమె పై అత్యాచారం చేసి ఏళ్ళు గడుస్తున్నా ఇంకా ఈ రోజు రేపు అంటూ కాలం వెల్లడిస్తున్నారు కాబట్టే ఈ సమాజం ఇలా తయారైంది. ఇకపొతే  నలుగురు దోషులకు కూడా అక్టోబర్-28,2019న ఈ విషయాన్ని తెలియజేసినట్లు తీహార్ జైలు సూపరిడెంట్ తెలిపారు. గడువులోగా నేరస్థులు క్షమాభిక్ష కోసం సవాల్ చేసే అవకాసమ్ ఉంది. ఉరిని రద్దు చేసి ..జీవిత ఖైదీ వేయాలని కోరవచ్చు. ఆలా చేయకపోతే   చేయకపోతే అదే విషయాన్ని న్యాయస్థానానికి తెలియజేస్తామని తెలిపారు. అనంతరం కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం మరణశిక్షను అమలుచేస్తామని తెలిపారు. ఈ కేసులోని నలుగురు దోషుల్లో ముగ్గురు తీహార్ జైలులో ఉండగా,ఇంకొకరు మండోలీ జైలులో ఉన్నారు.

మరణశిక్షను సవాల్ చేసే హక్కు దోషులకు ఉన్నప్పటికీ నలుగురిలో ఎవరూ దరఖాస్తు చేయలేదు. తమ శిక్ష తీవ్రతను తగ్గించి,మరణశిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మార్చాలని రాష్ట్రపతిని క్షమాభిక్ష పెట్టమని వేడుకునే అవకాశాన్ని కూడా వారు వినియోగించుకోకపోవడం గమనించదగ్గ విషయం. మరణశిక్షను పొందిన దోషులు వినయ్ శర్మ, ముఖేష్, అక్షయ్ కుమార్ సింగ్ మరియు పవన్ గుప్తా. ఇప్పటికైనా ఒక నిర్ణయం తీసుకున్నందుకు ఆనందంగా ఉంది అని నిర్భయ తల్లి తెలిపారు.
Tags:    

Similar News