ఆ దుర్మార్గుడి ముఖం అంద‌రికి చూపించాలి

Update: 2015-11-26 09:28 GMT
నిర్భ‌య ఉదంతం గుర్తుందా? ఆ దుర్మార్గంలో ఒక మైన‌ర్ నిందితుడు ఉన్నాడు. మేజ‌ర్‌ గా మార‌టానికి కొన్ని నెల‌ల వ్య‌వ‌ధిలో ఉన్న‌ప్ప‌టికీ.. నేరం చేసే నాటికి మైన‌ర్ గా  ఉండ‌టంతో అత‌గాడు చేసిన దారుణానికి ప‌డిన శిక్ష చాలా త‌క్కువ. నిర్భ‌య‌ను అత్యంత దారుణంగా హింసింది.. లైంగికంగా క్రూర చ‌ర్య‌కు పాల్ప‌డ‌ట‌మే కాదు..ఆమె మ‌ర‌ణానికి కార‌ణం ఈ మైన‌ర్ అన్న మాట అప్ప‌ట్లో వినిపించింది. అలాంటి క‌సాయిని చ‌ట్టంలో పేర్కొన్న ప్రకారం మైనర్‌ గా గుర్తించ‌టంతో క‌ఠిన శిక్ష నుంచి చ‌ట్ట‌బ‌ద్ధంగా త‌ప్పించుకున్న ప‌రిస్థితి. నిజానికి ఇత‌డు చేసిన దారుణానికి అత‌న్ని శిక్షించేందుకు వీలుగా.. మైన‌ర్ల వ‌య‌సును త‌గ్గించాల‌న్న చ‌ర్చ అప్ప‌ట్లో జోరుగా సాగింది.

కానీ.. ఈ విష‌యం మీద నాటి ప్ర‌భుత్వం సానుకూలంగా స్పందించింది లేదు. బూజు ప‌ట్టిన బ్రిటీష్ కాలం నాటి చ‌ట్టాల్ని మార్చేందుకు రాజ‌కీయ వ‌ర్గాలు.. మేధావి వ‌ర్గంగా చెప్పుకొనే కొంద‌రు మాన‌వ‌తావాదులు (క్రిమిన‌ల్స్ హ‌క్కుల గురించి మాట్లాడే వీరు.. బాధితుల ప‌క్షాన ఎందుకు మాట్లాడ‌రో అర్థం కాదు)  పుణ్య‌మా అని మైన‌ర్ నిర్వ‌చ‌నాన్ని మార్చ‌ని ప‌రిస్థితి. ఇలా త‌క్కువ శిక్ష‌తో జైల్లో ఉన్న ఇత‌గాడి ముఖాన్ని బ‌య‌ట ప్ర‌పంచానికి చూపించాల‌ని డిమాండ్ చేస్తున్నారు నిర్భ‌య త‌ల్లిదండ్రులు. జైల్లో శిక్ష అనుభ‌విస్తున్న అత‌గాడి ముఖాన్ని బ‌య‌ట ప్ర‌పంచానికి చూపించాలంటూ వారు జాతీయ మాన‌వ‌హ‌క్కుల క‌మిష‌న్‌ను అభ్య‌ర్థించారు. జైల్లో తీవ్ర‌వాదంపై అత‌డి దృష్టి ప‌డింద‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఇలాంటి దుర్మార్గుడి ముఖం అంద‌రికి తెలిస్తే ఎవ‌రి జాగ్ర‌త్త‌లో వారు ఉండే అవ‌కాశం ఉంది. మ‌రి.. దీనిపై ప్ర‌భుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.
Tags:    

Similar News