``దేశ ప్రధాని నరేంద్ర మోడీని కలిసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీకి ఎప్పుడు వచ్చినా మోడీ పొంగిపోతారు. ఒక కొడుకును చూసినట్టు జగన్‌ను చూస్తారు. తండ్రి లాంటి ఎఫెక్షన్ తో జగన్ ని ప్రధాని పలకరిస్తారు. వారి మధ్య తండ్రీ కొడుకుల బంధం ఉన్నట్టుగా అనిపిస్తుంది`` అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
అనంతపురం జిల్లా గోరంట్ల మండలంలోని పాలసముద్రం గ్రామం వద్ద నిర్మాణం కానున్న నాసిన్ (నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇండైరెక్ట్ టాక్సెస్ & నార్కోటిక్స్) అకాడమీ పనులకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ భూమి పూజ చేశారు. నాసిన్ అకాడమీ నిర్మాణం కోసం మొదటి దశలో 729 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తారు. ఇందుకోసం ఇప్పటికే నిధులు కేటాయించారు. రాష్ట్ర విభజన సమయంలో ఏపీలో నాసిన్ అకాడమీని ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీ మేరకు 2014 పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోనే అనంతపురం జిల్లాలోని పాల సముద్రం వద్ద నాసిన్ అకాడమీని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు.
అనంతరం 2015 ఏప్రిల్ నెలలో అప్పటి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ నాసిన్ అకాడమీ ఏర్పాటుకు శిలాఫలకం ఆవిష్కరణ చేశారు. ఈ మధ్య కాలంలో అకాడమికి సంబంధించి ఇచ్చిన భూమి చుట్టూ ప్రహరీ గోడను నిర్మించడం, పొలాలు ఇచ్చిన రైతులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద పరిహారం అందించారు.
ఈ రోజు శంకుస్థాపన కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే.. నాసిన్ అకాడమీ అంటే ఏంటంటే.. ఐఏఎస్ అధికారులకు ఉత్తరాఖండ్ లోని మస్సురి లో, ఐపిఎస్ అధికారులకు హైదరాబాదులోని సర్దార్ వల్లభాయ్ పటేల్ పోలీస్ అకాడమీలో ఏ విధంగా అయితే శిక్షణ ఇస్తారో అదే విధంగా అనంతపురం జిల్లాలోని పాల సముద్రం వద్ద ఏర్పాటు చేసిన నాసిన్ అకాడమీలో ప్రొబేషనరి ఐఆర్ఎస్ అధికారులకు ప్రపంచస్థాయి ప్రమాణాలతో శిక్షణ ఇస్తారు.
ఈ అకాడమీలో 2023 సెప్టెంబర్ నుంచి ప్రొబేషనరి ఐఆర్ఎస్ అధికారులకు శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అనంతరం 2024 నాటికి పూర్తి స్థాయిలో నాసిన్ ఆకాడమీని పూర్తి చేస్తారు. ఈ అకాడమీని పూర్తి చేసేందుకు కేంద్రమే నిదులు సమకూరుస్తుంది. అకాడమీ వల్ల హిందూపురం, పాలసముద్రం ప్రాంతంలో మరింత అభివృద్ధి జరుగుతుందని అంటున్నారు. నాసిన్ అకాడమీ ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు అందించడం గమనార్హం.
కేంద్ర ప్రభుత్వం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎటువంటి లోపం లేకుండా అన్ని రకాల సహకారం అందిస్తామని, నాసిన్ అకాడమీ ఏర్పాటు ఇందుకు ఒక ఉదాహరణ అనిఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల పేర్కొన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీని కలిసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఇతర మంత్రులు ఢిల్లీకి ఎప్పుడు వచ్చినా వారిని ప్రధాని కలుస్తారని, ఒక తండ్రి లాంటి ఎఫెక్షన్ తో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ని ప్రధాని పలకరిస్తారన్నారు. రాష్ట్రానికి ఎటువంటి లోపం లేకుండా అన్ని రకాల సహకారం అందిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి తెలిపారు.