పత్రికల్లో ఒకలా ప్రాక్టికల్ గా మరోలా ఉండే అంశాలు చాలానే ఉంటాయి. రూల్ బుక్ లో రూల్స్ ఎలా అయితే పలువురు పోలీసులు ఫాలో కారో.. చట్టంలో ఉన్న దానిని ఫాలో అయ్యేందుకు కొందరు ససేమిరా అంటారు. అలా చేయకుండా నేరమవుతుందంటే.. కేసు పెట్టుకో అంటారే కానీ ఒప్పుకోరు. ఇదంతా దేని గురించి అంటే.. పది రూపాయిల నాణెం గురించి.
పది రూపాయిల కాయిన్ ఏ ముహుర్తంలో బయటకు వచ్చిందో కానీ.. దాన్ని మార్చటానికి జనాలు పడే పాట్లు అన్ని ఇన్ని కావు. కూరగాయల దగ్గర నుంచి టోల్ గేట్ వాడి వరకూ పది రూపాయిల బిళ్లను తీసుకునేందుకు ససేమిరా అంటారు. పది రూపాయిల బిళ్ల చెల్లుతుంది.. ఎందుకు తీసుకోవంటే.. నాకొద్దు.. వేరే వాళ్లకు ఇచ్చుకో అంటారే కానీ తీసుకునేందుకు మాత్రం ఎవరికి వారు నో చెబుతుంటారు.
ఈ నేపథ్యంలో పలుమార్లు పదిరూపాయిల నాణెం చెల్లుబాటు మీద ఇప్పటికే పలు ప్రకటనలు ఇచ్చినప్పటికీ పరిస్థితుల్లో మాత్రం మార్పు రాని పరిస్థితి. ఇలాంటి వేళ.. తాజాగా రూ.20 నాణెన్ని విడుదల చేయనున్నట్లుగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో తన ప్రసంగంలో భాగంగా కొత్తగా విడుదల చేయనున్న నాణెల గురించి చెప్పుకొచ్చారు. రూపాయి.. రెండు రూపాయిలు.. ఐదు.. పదితో పాటు కొత్తగా రూ.20 నాణెన్ని విడుదల చేయనున్నట్లు చెప్పారు. అంధులు గుర్తించేలా ఈ కొత్త నాణెన్ని తయారు చేసినట్లుగా ఆమె పేర్కొన్నారు.
కేంద్ర ఆర్థిక మంత్రిగారి మాట బాగానే ఉన్నా.. నాణెన్ని తీసుకోమనే వారి ఇబ్బందుల్ని తీర్చటమే ఎక్కువ రిస్క్. దాని కంటే.. నోట్లను విరివిగా అందుబాటులోకి తీసుకొచ్చేయొచ్చుగా?