నిర్మలా సీతారామన్ మాటతో పాకిస్తాన్ గుండెల్లో రైళ్లు

Update: 2019-08-05 15:50 GMT
సోమవారం ఉదయం 11 గంటలకు రాజ్యసభలో హోం మంత్రి అమిత్ షా జమ్ముకశ్మీర్ విభజన - ఆర్టికల్ 370 రద్దు బిల్లులు పెట్టిన తరువాత రోజంతా ఇదే హాట్ టాపిగ్గా మారింది. ఇది భారత దేశంలో చోటు చేసుకున్న మార్పుగానే చాలామంది చూశారు.. అయితే.. సాయంత్రానికి అసలు ఉద్దేశం పూర్తిగా బయటపడింది. రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ అసలు విషయం వెల్లడించారు. రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడిపోతున్న జమ్ముకశ్మీర్‌ లో ఒక ప్రాంతం పరిధిలోకి పాక్ ఆక్రమిత కశ్మీర్‌ నూ తీసుకొస్తామని ఆమె చెప్పడంతో పాకిస్తాన్ గుండెల్లో దడ మొదలైంది.

జ‌మ్ము కాశ్మీర్ అభివృద్దితో పాటుగా పీఓకే విముక్తి చేయ‌టమే ల‌క్ష్య‌మ‌నే అంచ‌నాలు మొద‌ల‌య్యాయి. జ‌మ్ము కాశ్మీర్‌ ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్ర‌తిపాదించారు. జ‌మ్ము కాశ్మీర్‌ కు చ‌ట్ట స‌భ‌తో కూడిన కేంద్ర పాలిత ప్రాంతంగా నిర్ణ‌యించారు. ల‌ఢ‌ఖ్‌ ను చంఢీఘ‌ర్ త‌ర‌హా కేంద్ర పాలిత ప్రాంతంగా ప్ర‌తిపాదించారు. దీని ద్వారా ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌త్యేక ప్ర‌తిప‌త్తి తో ఉన్న జ‌మ్ము కాశ్మీర్ ఇక నుండి పూర్తిగా కేంద్రం ప‌రిధిలోకి రానుంది. జ‌మ్ము కాశ్మీర్‌ లో చ‌ట్ట స‌భ‌లు ఉన్నా..కేంద్రం పెత్త‌నం కొన‌సాగ‌నుంది. ఇదే అంశం పైన రాజ్య‌స‌భ‌లో చ‌ర్చ స‌మ‌యంలో ఆర్దిక మంత్రి..ర‌క్ష‌ణ శాఖా మాజీ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ కీల‌క అంశాన్ని బ‌య‌ట పెట్టారు. జ‌మ్ము కాశ్మీర్‌ తో పాటుగా పాక్ ఆక్ర‌మిత కాశ్మీర్ మొత్తంగా కేంద్ర పాలిత ప్రాంతం ప‌రిధిలోకి వ‌స్తుంద‌ని వెల్ల‌డించారు. పీఓకే మీద కేంద్రం అజ‌మాయిషీ ద్వారా.. పాక్ ఆక్ర‌మిత కాశ్మీర్ మీద ప‌ట్టుకోసం కేంద్ర ప్ర‌భుత్వం వ్యూహాత్మ‌కంగా ఒక్కో అడుగు వేస్తోంది. అందులో భాగంగా ఇప్ప‌టికే పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్ర‌వాదం గురించి అంత‌ర్జాతీయ వేదిక‌ల మీద ప్ర‌స్తావించి..దౌత్య ప‌రంగా పాకిస్థాన్‌ ను ఏకాకిని చేసింది. ఒక ర‌కంగా అంత‌ర్జాతీయ స‌మాజంలో పాకిస్థాన్‌ ను ఒంట‌రి చేసింది. ఆర్దిక‌-పాల‌నా ప‌ర‌మైన ఇబ్బందుల‌తో స‌త‌మ‌తం అవుతున్న పాకిస్థాన్ ను పూర్తిగా దెబ్బ తీయాల‌నే ల‌క్ష్యంతో ముందుకు వెళ్తోంది. అందులో భాగంగా ముందుగా జ‌మ్ము కాశ్మీర్ ను పూర్తిగా త‌మ నియంత్ర‌ణ‌లోకి తెచ్చుకుంటోంది. కేంద్ర పాల‌త ప్రాంతంగా చేయటం ద్వారా అక్క‌డ అసెంబ్లీ ఉన్నా పెత్త‌నం కేంద్రందే సాగుతోంది.

ఇక‌, ల‌డ‌ఖ్‌ లో పూర్త‌గా కేంద్ర‌మే ప‌ర్య‌వేక్ష‌ణ ఉంటుంది. ఇప్పుడు తాజాగా పాక్ ఆక్ర‌మిత కాశ్మీర్ సైతం కేంద్ర పాలిత ప్రాంత ప‌రిధిలోకి రావ‌టం ద్వారా కేంద్రానికి ముందుగా దాని పైన అజ‌మాయిషీకి అవ‌కాశం ఏర్ప‌డుతోంది. ఆ త‌రువాత ప‌రిస్థితుల‌కు అనుగుణంగా పీఓకే విష‌యంలో నిర్ణ‌యా లు చేయ‌టానికి కేంద్రం త‌మ వ‌ద్దే అధికారం ఉండేలా వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించింది.  ఇప్పుడు పాక్ ఆక్రమిత కశ్మీర్‌ ను కేంద్రపాలిత ప్రాంతం కానున్న లద్దాఖ్‌ లోకి తేవడానికి బీజేపీ సిద్ధమవుతోంది. దీనికి సైనిక చర్య తప్పకపోవచ్చు. బీజేపీ ఈ విషయంలో ఎలాంటి వ్యూహంతో వెళ్తుందో చూడాలి.


Tags:    

Similar News