భారతదేశం నిజంగా చాలా గొప్పదేశం కదా?! చాలామంది ఇటీవల అసహనం అనే పాయింట్ ను తెరమీదకు తెచ్చారు కానీ మనదేశం ఎంతో సహనం కలిగిఉన్నది. సాక్షాత్తు దేశం గర్వించదగ్గ ప్రధానమంత్రికే అవమానం తలపెట్టినా దిక్కూ దివానా లేని పరిస్థితి మరి.
మాజీ ప్రధాని - బీజేపీ సీనియర్ నేత అటల్ బిహారీ వాజ్ పేయిని పార్టీలతో సంబంధం లేకుండా అందరూ అభినందిస్తుంటారు. చివరి దశలో ఉన్నప్పటికీ ఆయన విశిష్టతలను గుర్తించి అవార్డు ప్రకటించడమే కాకుండా స్వయంగా ఇంటికి వెళ్లి అందజేశారంటేనే ఆయన్ను ఏ రేంజ్ లో గౌరవిస్తారో అర్థం చేసుకోవచ్చు. అయితే అంతటి గొప్ప మనిషికి చెందిన విద్యార్హతల పత్రాలు కనిపించడం లేదు! ఎక్కడో కాదు ఆయన చదువుకున్న చోటే.
ఉత్తర్‌ప్రదేశ్ లోని ఛత్రపతి సాహుజీ మహరాజ్ విశ్వవిద్యాలయం (సీఎస్ జిఎంయూ)లో వాజ్ పేయి చదువుకున్నారు. అప్పటి పత్రాలు కావాలని ఓ బీజేపీ కార్యకర్త కోరగా లేవని సమాధానం వచ్చింది. దీంతో బాగా హర్ట్ అయిన బీజేపీ నేతలు - కార్యకర్తలు వాజ్ పేయి సర్టిఫికేట్ల కోసం ఆ యూనివర్సిటీ ఎదుట ఆందోళనా కార్యక్రమం చేపట్టారు. ఈ విషయం మరింత సీరియస్ గా మారి కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ దృష్టికి చేరింది దీంతో ఆమె వాజ్ పేయి సర్టిఫికేట్ల కోసం చత్రపతి సాహూ వర్సిటీ కంటే ముందు ఆగ్రాలో చదివిన భీమ్ రావ్ అంబేద్కర్ విశ్వవిద్యాలయాన్ని అభ్యర్థించారు.
అయితే ఇక్కడా చుక్కెదురయింది. వాజ్ పేయి సర్టిఫికేట్లను ఛత్రపతి సాహుజీ మహరాజ్ విశ్వవిద్యాలయం పంపినట్లు బీఆర్ ఏయూ తెలిపింది.మొత్తంగా వాజ్ పేయి పోస్టు గ్రాడ్యుయేషన్ చేసిన దయానంద్ ఆంగ్లో వేదిక్ కళాశాల, ఛత్రపతి సాహుజీ మహరాజ్ విశ్వవిద్యాలయం కానీ ఆ సర్టిఫికేట్లు తమ వద్ద లేవని స్పష్టం చేయడంతో బీజేపీ నేతలు ఆందోళన చేపట్టారు.
ఇది మనదేశంలోని కొందరు ప్రభుత్వ అధికారులు - ఉద్యోగుల చక్కటి పనితీరు. దేశం గర్వించే ప్రధాని పత్రాలకే అతీగతీ లేకుంటే సామాన్యుల సంగతి వాళ్లేం పట్టించుకుంటారు బాస్?