రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ కూతురు ఇషా అంబానీకి వివాహం నిశ్చయమైన సంగతి తెలిసిందే. ప్రముఖ వ్యాపారవేత్త, పిరమాల్ సంస్థల వారసుడు ఆనంద్ పిరమాల్, ఇషా అంబానీలు త్వరలో ఓ ఇంటివారు కాబోతున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం ఈ ఇద్దరి నిశ్చితార్థ విందు ఘనంగా జరిగింది. త్వరలో పెళ్లిచేసుకోబోతోన్న ఈ జంటతో పాటు ఇరు కుటుంబాల వారు ఈ విందు వేడుకను అంగరంగవైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బాలీవుడ్, క్రికెట్, వ్యాపార ప్రముఖులు హాజరై సందడి చేశారు. కాబోయే పెళ్లికూతురు ఇషా అంబానీ, ఆమె తల్లి నీతా అంబానీలు కలిసి స్టెప్పులేయడం ఎంగేజ్ మెంట్ పార్టీకే సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా నిలిచింది. తన కూతురితో కలిసి బాలీవుడ్ పాటలకు డ్యాన్స్ చేసిన వీడియోను నీతా అంబానీ సోషల్ మీడియా షేర్ చేయడంతో అది వైరల్ అయింది.
అంబానీ, పిరమల్ కుటుంబాల మధ్య 40ఏళ్లుగా స్నేహం ఉంది. దీనికి తోడు ఇషా అంబానీ, ఆనంద్ పిరమల్ లు మంచి స్నేహితులు. ఈ నేపథ్యంలోనే ఆనంద్ పెళ్లి ప్రపోజల్ ను ఇషా అంగీకరించారు. దీంతో, ఇరు కుటుంబాలు వారికి పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నాయి. ఈ నేపథ్యంలోనే నిన్న రాత్రి వారి ఎంగేజ్ మెంట్ పార్టీని గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు. ఈ కార్యక్రమానికి సచిన్ టెండూల్కర్ - షారూక్ ఖాన్ - ఆమీర్ ఖాన్ - రణ్ బీర్ కపూర్ - కరణ్ జోహార్ తదితరులు హాజరై సందడి చేశారు. ఇషా - నీతా అంబానీలు.... బాలీవుడ్ పాటలకు స్టెప్పులేసి సందడి చేశారు. ఇషా - ఆనంద్ ల పెళ్లిని డిసెంబరులో చేయాలని ఇరు కుటుంబసభ్యులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇషా కవల సోదరుడు ఆకాశ్ అంబానీ, ప్రముఖ వజ్రాల వ్యాపారి రస్సెల్ మెహతా కుమార్తె శ్లోకల వివాహం కూడా డిసెంబరులోనే జరగనుంది. వీరిద్దరి పెళ్లిళ్లు ఒకేసారి చేయాలని అంబానీ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
వీడియో చూడటానికి క్లిక్ చేయండి
Full View