వారందరి 'టీకా' ఫ్రీ ... నీతా అంబానీ కీలక ప్రకటన !

Update: 2021-03-05 15:30 GMT
రిలయెన్స్ ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులకు రిలయెన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక ఛైర్ పర్సన్ అయిన నీతా అంబానీ శుభవార్త తెలిపారు. దేశంలో కరోనా వైరస్ వ్యాక్సినేషన్ కార్యక్రమం కింద రిలయెన్స్ ఉద్యోగులు, వారి భార్యా పిల్లలు, తల్లిదండ్రులు వారి పేర్లను నమోదు చేసుకోవాలని నీతా అంబానీ ఉద్యోగులకు మెయిల్ ద్వారా సందేశంలో కోరారు. కరోనా టీకాలకు అయ్యే వ్యయాన్ని తమ రిలయెన్స్ కంపెనీ భరిస్తుందని నీతాఅంబానీ తెలిపారు.  ఈ మేరకు రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్పర్సన్, ముఖేశ్‌ అంబానీ సతీమణి నీతా అంబానీ కీలక ప్రకటన చేశారు.

.రిలయెన్స్ ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులు ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని అందుకే కరోనా టీకాలు వేసుకోవడంతో పాటు ముందస్తు జాగ్రత్తగా కరోనా మార్గదర్శకాలను పాటించాలని నీతాఅంబానీ సూచించారు.గతంలో 2020 రిలయెన్స్ ఫ్యామిలీ డే సందర్భంగా అదరికీ కరోనా వ్యాక్సిన్ అందిస్తామని రిలయెన్స్ ఛైర్మన్ ముకేష్ అంబానీ, నీతాఅంబానీలు ప్రకటించారు. ఉద్యోగుల ఆరోగ్యం, ఆనందాన్ని కాపాడుకోవడమే ముఖేశ్‌ అంబానీ, తన బాధ్యత అని తెలిపారు. మహమ్మారి అంతం చివరి దశలో ఉన్నాం. కరోనా నిబంధనలు,  జాగ్రత్తలు తీసుకుంటూనే మీ అందరి మద్దతుతో ఈ సామూహిక యుద్ధాన్ని గెలుద్దాం అని నీతా  సందేశమిచ్చారు.

దీనితో దేశంలోని తమ ఉద్యోగుల కరోనా టీకా ఖర్చులను భరించే ప్రణాళికలను ప్రకటించిన టెక్-జెయింట్స్ ఇన్ఫోసిస్, టీసీఎస్‌, కాప్ ‌జెమినీ, యాక్సెంచర్ సరసన ఆర్ ‌ఐఎల్ చేరింది. రిలయన్స్ గ్రూప్‌ తో పాటు దాని అనుబంధ సంస్థల లక్షలాది శాశ్వత, తాత్కాలిక ఉద్యోగుల కుటుంబాలు లబ్ధి పొందనున్నాయి. కాగా మార్చి1నుంచి దేశవ్యాప్తంగా రెండో దశ వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది.  60 ఏళ్లు పైబడిన వారితో పాటు 45 ఏళ్లు నిండి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి కరోనా టీకా అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వ్యాక్సిన్ స్వీకరించిన వారి మొత్తం సంఖ్య 1.77 కోట్లు దాటింది.  మరోవైపు దేశంలో కరోనా ఉధృతి మళ్లీ పెరుగుతోంది.
Tags:    

Similar News