నీతా అంబానీ ముందు ఎవరూ నిలవలేకపోయారు

Update: 2016-04-07 10:57 GMT
దేశంలో అత్యధిక ధనవంతుల జాబితాలో తిరుగులేని విధంగా అగ్రస్థానంలో నిలిచే ముకాశ్ అంబానీ ఫ్యామిలీ తాజాగా మరోసారి వార్తల్లోకి వచ్చింది. నీతా అంబానీ తాజాగా ఆసియా మోస్ట్ పవర్ ఫుల్ మహిళగా ఎంపికయ్యారు. మొత్తం యాభై మంది మహిళా వ్యాపారవేత్తల్ని పోర్భ్ జాబితాను విడుదల చేయగా నీతూ అంబానీ ఫస్ట్ ప్లేజ్ ను సాధించటం ఆసక్తికర అంశంగా చెప్పాలి.

ఫోర్బ్ మదింపుచేసిన జాబితాలో మొనగాళ్లు లాంటి  మహిళలు చాలా మందే ఉన్నారు. ఎస్ బీఐ ఛైర్మన్.. ఎండీ అరుంధతి భట్టాచార్య రెండో స్థానంతో నిలిచారు. ఈ ఇద్దరే కాకుండా మొత్తం 50 మంది పవర్ ఫుల్ ఉమెన్ పర్సనాలిటీస్ లో భారత మహిళల పేర్లు మరో ఆరుగురికి ఈ జాబితాలో నిలిచారు. అలా నిలిచిన భారతీయ మహిళా వ్యాపారవేత్తల్నిచూస్తే..

=అంబిగా ధీరజ్ (మ్యూ సిగ్మా సీఈవో) (14వ స్థానం)

= దీపాళి గోయింకా (వెల్స్ పన్ ఇండియా సీఈవో) (16వ స్థానం)

= వినితా గుప్తా (లుపిన్ సీఈవో) (18వ స్థానం)

= ఐసీసీఐ బ్యాంక్ సీఈవో  చందా కొచ్చార్ (22వ స్థానం)

=  వందనా లుత్రా (వీఎల్ సీసీ హెల్త్ కేర్ వ్యవస్థాపకురాలు) (26వ స్థానం)

= కిరణ్ మంజుందర్ షా (బయోకాన్ ఛైర్మన్) (28వ స్థానం)
Tags:    

Similar News