తరచూ ఆసక్తికర వ్యాఖ్యలు చేయటంలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ముందుంటారు. తన తీరుతో ఆయన గురించి మీడియాలో ప్రత్యేకంగా వార్తలు వస్తుంటాయి. తాజాగా ఆయన నోటి నుంచి వచ్చిన వ్యాఖ్యలు అవాక్కు అయ్యేలా చేయటమే కాదు..సంచలనంగా మారాయి. లంచం దేశంలో ఎంత కామనో ప్రతి ఒక్కరికి తెలిసిందే. అలాంటి లంచం అడిగే అధికారుల్ని కొట్టేయమని సలహా ఇవ్వటం చర్చనీయాంశంగా మారింది.
లంచం అడిగిన అధికారుల్ని కొట్టేయాలంటూ గడ్కరీ సాబ్ చేసిన వ్యాఖ్యలు ఒక ఎత్తు అయితే.. ఆయన ఏ సందర్భంలో ఈ తరహా వ్యాఖ్యలు చేశారన్నది చూస్తే.. లఘు ఉద్యోగ్ భారతి కార్యక్రమాన్ని తాజాగా నిర్వహించారు. ఇందులో మాట్లాడిన ఆయన ఊహించని రీతిలో లంచం వ్యవహారాన్ని తీసుకొచ్చారు. ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలకు సేవకులని.. అలాంటి వారు ప్రజలకు అవసరమైన పనులు చేయాల్సిన బాధ్యత ఉందన్నారు.
అందుకు భిన్నంగా పని చేయకుండా.. లంచం అడిగే అధికారుల్ని కొట్టాలన్నారు. పారిశ్రామికవేత్తలు నిర్బయంగా తమ వ్యాపారాల్ని విస్తరించాలని.. ప్రభుత్వ అధికారుల చేతిలో వేధింపులకు గురి కావొద్దన్నారు. తన మాదిరే అధికారులు కూడా ప్రజలకు జవాబుదారీ అని.. వారు దొంగతనం చేస్తే వారిని తాను దొంగ అని అంటానని.. అదే రీతిలో లంచం అడిగితే కొట్టేయాలంటూ పారిశ్రామికవేత్తలకు కేంద్రమంత్రి గడ్కరీ ఇచ్చిన సలహా పర్యవసానాలు ఎలా ఉంటాయో?