గడ్కరీ కారులో తలదించుకొని కూర్చున్నారంటే..

Update: 2016-06-20 07:13 GMT
ఈ మధ్య కాలంలో ఓపెన్ గా మాట్లాడే రాజకీయ నేతలే తగ్గిపోతున్న పరిస్థితి. నేతలు నోరు విప్పితే చాలు.. అందులో రాజకీయమే తప్పించి.. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే తత్వం రోజురోజుకి తగ్గిపోతుంది. రాజకీయ నాయకుడు రాజకీయాలు మాట్లాడకుండా ఉన్నది ఉన్నట్లుగా ఎందుకు చెబుతారన్న ప్రశ్నలో లాజిక్ ఉండొచ్చు కానీ.. గతంలో ఉన్నత స్థానాల్లో ఉన్న రాజకీయ నాయకులు ఎంతో కొంత ఓపెన్ గా ఉండేవారు. కొన్ని సందర్భాల్లో తమ మనసులో చెలరేగే భావాల్ని పంచుకొనేవారు. చేస్తున్న తప్పుల్ని చెప్పి తప్పు అయిపోయిందని బాధ పడేవారు. ఇప్పుడు అలాంటి పరిస్థితే కనిపించదు.

తాజాగా కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ చెప్పిన మాటలు ఆ లోటును తీర్చేలా ఉండటం గమనార్హం. మహారాష్ట్రలో జరిగిన బీజేపీ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొన్న గడ్కరీ తన వ్యక్తిగత సిబ్బంది చేసే ఓవరాక్షన్ గురించి వివరంగా చెప్పుకొచ్చారు.  ఇలాంటి సందర్భాల్లో తానెంత ఇబ్బందికి గురి అవుతానన్న విషయాన్ని ఆయన వెల్లడించారు. ఇటీవల తాను ట్రైన్ లో నాగపూర్ కు వెళ్లాల్సిన సయంలో స్టేషన్ మాష్టర్ కు ఫోన్ చేసిన తన పీఏ.. ట్రైన్ ను ఒకటో నెంబరు ఫ్లాట్ ఫాం మీదకు రైలును తీసుకురావాలంటూ చెప్పారన్నారు.

 ‘నా కాలికి గాయం అయ్యిందని పీఏ చెప్పినట్లు తెలిసింది. అలాగే మంత్రుల కోసం పోలీసులు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తుంటారు. మంత్రులు వస్తుంటే ట్రాఫిక్ మొత్తాన్ని ఆపేస్తారు. దీని వల్ల ప్రజలు తిట్టుకుంటుంటారు. మంత్రులు ఎప్పుడైనా మాజీలు కావొచ్చు. కానీ.. కొంతమంది చేసే అత్యుత్సాహపు చర్యలతో ప్రజలు చికాకు పడుతుంటారు. తిట్టుకుంటుంటారు. అందుకే.. ఇలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు కారులో తల దించుకొని కూర్చుంటా’’ అని నిర్మోహమాటంగా చెప్పారు. సో.. నితిన్ గడ్కరీ కారులో వెళుతూ తల దించుకొని.. ముఖం కనిపించకుండా కవర్ చేస్తున్నారంటే.. అధికారులు ఓవరాక్షన్ చేస్తున్నట్లే అన్న మాట. ఏమైనా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడిన నితిన్ గడ్కరీ మాటలు మనసుల్ని దోచుకునేలా ఉన్నాయని చెప్పక తప్పదు.
Tags:    

Similar News