సామాన్యులకు ఉన్నట్లే రాజకీయ నాయకులకు కోరికలు ఉంటాయి. సామాన్యుల కోరికలే ఓ రేంజ్ లో ఉంటే.. అత్యున్నత స్థానాల్లో ఉన్న వారి కోర్కెలె ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు. తాజాగా కేంద్రమంత్రి నితిన్ గడ్కరి తన చిరకాల వాంఛను బయటపెట్టారు. ఆయన కోరిక వింటే వావ్ అనాల్సిందే.
ఆయన కోరిక కానీ వాస్తవరూపం దాలిస్తే.. ముంబయి వాసులు నితిన్ గడ్కరినీ ఎప్పటికీ మర్చిపోలేరు. ఇంతకీ నితిన్ తీరని కోరిక ఏమంటే.. ముంబయి బీచ్ ఒడ్డున బూర్జ్ ఖలీఫాకు మించిన భవంతి ఒకటి కట్టాలన్నదే ఆయన కోరికట. అంతర్జాతీయ స్థాయిలో అత్యంత ఎత్తైన భవనంగా పేరున్న బూర్జ్ ఖలీఫాను మించిన భవంతిని ముంబయి ఒడ్డున ఏర్పాటు చేస్తూ చూడాలన్నదే తన కోరికగా చెప్పుకొచ్చారు.
ఊరికే భారీ బిల్డింగ్ అని చెప్పి వదిలేయకుండా.. అందులో ఏం ఉండాలో కూడా స్పష్టగా చెప్పుకొచ్చారు గడ్కర. తన కలల సౌధంలో 30 అంతస్తులు కేవలం మీటింగ్స్ కోసమే ఏర్పాటు చేయాలని.. మరో 30 అంతస్తులు రెస్టారెంట్ల కోసం.. మరో 30 అంతస్తులు హోటల్స్ కోసం.. 20 అంతస్తుల్లో షాపింగ్ కోసం ఏర్పాటు చేయటంతో పాటు.. ఇంత భారీ బిల్డింగ్ కి అవసరమైన విశాలమైన పార్కింగ్ కూడా ఉండాలని చెప్పుకొచ్చారు. శివాజీ పేరుతో నిర్మించాలన్న ఈ బిల్డింగ్ కల తన వ్యక్తిగతమైనది చెప్పుకొచ్చారు. నితిన్ గడ్కరీ కోరిక తెలిసిన వారంతా అది తమ అందరి కోరికగా చేసుకుంటారని ఖాయంగా చెప్పొచ్చు.