ఆ సీఎం ఆస్తుల లెక్క వింటే ఆశ్చర్యపోవాల్సిందే

Update: 2017-01-02 10:53 GMT
రాజకీయ నేతలు తమ ఆస్తుల్ని వెల్లడిస్తే.. ఆ లెక్కల్ని చదివిన ప్రతిసారీ కామెడీ కామెడీగా ఉంటూ ఉంటుంది. తాజాగా బీహార్ ముఖ్యమంత్రి.. ఆయన క్యాబినెట్ కు చెందిన మంత్రులు పలువురు వెల్లడించిన ఆస్తుల వివరాలు వింటే ఆశ్చర్యాన్ని రేకెత్తించేలా ఉండటమే కాదు.. కాస్తంత వెరైటీగా ఉండటం విశేషంగా చెప్పాలి.

తాజాగా వెల్లడించిన ఆస్తుల లెక్కల ప్రకారం.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న నితీశ్ కుమార్ ఆస్తులు.. ఆయన కుమారుడి ఆస్తుల కంటే తక్కువగా ఉండటం విశేషంగా చెప్పాలి. కొడుకు కంటే పేదవాడైన తండ్రిగా ఆయన ఆస్తి లెక్కలు చెబుతున్నాయి. సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉంటూ.. ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న వ్యక్తి ఆస్తులు.. ఆయన కుమారుడికి కంటే తక్కువగా ఉండటానికి మించిన వెరైటీ ఏముంటుంది?

నితీశ్ ఆస్తుల లెక్క చూస్తే.. చేతిలో కాసింత నగదు.. బ్యాంకులో డిపాజిట్లు.. ఢిల్లీలో ఒక ఫ్లాటు.. ఆవులు.. బర్రెలు.. ఒక ఎక్సర్ సైజ్ సైకిల్ సహా తన ఆస్తి మొత్తం రూ.56 లక్షలుగా నితీశ్ లెక్కలు చెప్పారు. అదే సమయంలో ఆయన కుమారుడి ఆస్తి మాత్రం రూ.2.36 కోట్లుగా ఉండటం విశేషం. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. బీహార్ మంత్రులు పలువురు వెల్లడించిన వారి ఆస్తుల లెక్కల్లో మంత్రుల ఆస్తుల కంటే.. మంత్రుల సతీమణుల ఆస్తులే ఎక్కువగా ఉన్నాయి.

ఇక.. నితీశ్ ప్రభుత్వంలో భాగస్వామి అయిన ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుల ఆస్తుల విషయానికి వస్తే.. డిప్యూటీ సీఎంగా వ్యవహరిస్తున్న తేజస్వి యాదవ్.. తనకు సొంతంగా వెహికిల్ లేదని చెప్పారు. అదే సమయంలో పలుచోట్ల ఫ్లాట్లు కొన్నట్లుగా వెల్లడించారు. ఇక.. లాలూ చిన్న కొడుకు.. మంత్రిగా వ్యవహరిస్తున్న తేజ్ ప్రతాప్  యాదవ్ వద్ద  రూ.15 లక్షలు విలువ చేసే బైక్.. రూ.29 లక్షలు విలువ చేసే కారు.. దినాపూర్.. పుల్వారి షరీఫ్ లలో ఫ్లాట్లు ఉన్నట్లు వెల్లడించారు. ఫర్లేదు.. అధికారికంగా కూడా ఓ మోస్తరు ఆస్తులే ప్రకటించారే లాలూ తనయులు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News