అంకెలు అనుకూలంగా ఉంటే.. ఎలాంటి పరిస్థితిని అయినా తమకు తగ్గట్లుగా మార్చుకోవచ్చు. బీహార్ ముఖ్యమంత్రిగా ఆరోసారి ప్రమాణస్వీకారం చేసిన నితీశ్ కుమార్ ను చూస్తే ఇట్టే అర్థమవుతుంది. నిన్న రాత్రి సీఎం పదవికి రాజీనామా చేసిన నితీశ్ గంటల వ్యవధిలోనే మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారని చెప్పాలి.
వాయువేగంతో మారిన బీహార్ రాజకీయ సమీకరణాలతో పాటు.. ప్రభుత్వం కూడా అంతే చిత్రంగా గంటల వ్యవధిలో పూర్తిగా మారిపోయిన వైనం చూస్తే.. పక్కా ప్లాన్‌ను వ్యూహాత్మకంగా అమలు చేసినట్లుగా కనిపించక మానదు. జేడీయూ.. ఆర్జేడీ.. కాంగ్రెస్ మహా కూటమితో ఉన్న సంకీర్ణ సర్కారుకు ఝులక్ ఇచ్చిన నితీశ్.. ముఖ్యమంత్రిగా తన పదవికి నిన్న రాత్రి రాజీనామా చేయటం.. ఆ వెంటనే గవర్నర్ ఆమోదించటం తెలిసిందే.
లేటు నైట్ లో జేడీయూ శాసనసభాపక్ష సమావేశం జరగటం.. నితీశ్ ను తమ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకోవటం.. నితీశ్ కు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే తాము మద్దతు ఇస్తామని బీజేపీ ముందుకు రావటంతో రాత్రికి రాత్రే అధికార బదిలీకి సంబంధించిన ఏర్పాట్లు పక్కాగా జరిగిపోయాయి. ఇలాంటి వేళలో వేగానికి కళ్లాలు వేసే గవర్నర్ కూడా ఈ ఎపిసోడ్ లో మాత్రం గంటల వ్యవధిలోనే నితీశ్‌ను మళ్లీ ముఖ్యమంత్రి అయ్యేందుకు ఓకే చెప్పేయటంతో ఈ రోజు (గురువారం) ఉదయం 10 గంటల వేళ.. మరోసారి బీహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ ప్రమాణస్వీకారాన్ని పూర్తి చేశారు. ఇక ఉప ముఖ్యమంత్రిగా బీజేపీ సీనియర్ నేత సుశీల్ కుమార్ మోదీ బాధ్యతల్ని చేపట్టనున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన ఆయన.. డిప్యూటీ స్పీకర్ గా వ్యవహరించనున్నారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వి యాదవ్ ను మంత్రి వర్గం నుంచి తొలగేలా నిర్ణయం తీసుకోవాలని నితీశ్ కోరటం.. అందుకు లాలూ ససేమిరా అనటంతో బీహార్ రాజకీయ పరిణామాలు మెరుపు వేగంతో మారిపోవటం తెలిసిందే.