దేశంలో మోడీ బలంగా తయారవుతున్నాడు. రెండుసార్లు గెలిచిన సమరోత్సోహంతో దూసుకెళ్తున్నారు. మోడీని ఆపడం ఒక కాంగ్రెస్ తో సాధ్యం కాదని తేలిపోయింది. అందుకే ప్రతిపక్షాలన్నీ కలిసి కూటమి కట్టేందుకు తాపత్రయపడుతున్నా యి. కాంగ్రెస్ ఇందుకు పెద్దన్న పాత్ర పోషిస్తుండగా మిగతా ప్రాంతీయ పార్టీలు మాత్రం తలోదారి చూసుకుంటున్నారు. ఆ ప్రాంతీయ పార్టీలను దాటిన కట్టేందుకు ఇప్పుడు బీహార్ సీఎం నితీష్ కుమార్ రంగంలోకి దిగుతారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి మోడీని ఓడించాలని లేకుంటే ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ సహా అన్ని పార్టీలు కనుమరుగవుతాయని భయం వారిలో నెలకొంది. కాంగ్రెస్ ను బిజెపిని వ్యతిరేకిస్తున్న పార్టీలను కూడా చేర్చే బాధ్యతను బీహార్ సీఎంకు కాంగ్రెస్ అప్పగించింది. పాత పరిచయాలతో ఇప్పుడు నితీష్ కేసీఆర్ ను కాంగ్రెస్ కూటమిలోకి తెచ్చే ప్రయత్నాలు మొదలుపెట్టారు.
బీజేపీ వ్యతిరేక పార్టీలను ఏకం చేయాలని రాహుల్ గాంధీ నాయకత్వంలో విపక్షాల నేతలు నిర్ణయించారు. ఇందుకోసం అన్ని పార్టీలను కలుపుకు పోవాలని డిసైడ్ అయ్యారు. బీజేపీని వ్యతిరేకిస్తూ అదే సమయంలో కాంగ్రెస్ తోనూ దూరం పాటిస్తున్న పార్టీలను కలుపుకోవాలని భావిస్తున్నారు. ఇందుకోసం ఆప్.. టీఎంసీతోపాటుగా బీఆర్ఎస్ ను కలుపుకొని వెళ్లాలని నిర్ణయించారు. ఈ మేరకు కేసీఆర్ తో మాట్లాడే బాధ్యతను నితీష్ తీసుకున్నారు.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, బీహార్ సీఎం నితీష్ లు బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాల కూటమి దిశగా అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగానే కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, బీహార్ సీఎం నితీష్, తేజస్వి యాదవ్ తో సహా పలువురు పార్టీల నేతలు హాజరయ్యారు. బీజేపీకి వ్యతిరేకంగా కలిసికట్టుగా వెళ్లాల్సిన అవసరం పై చర్చించారు. విపక్షాలు సంఘటితంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని నిర్ణయించారు.
తాజాగా ఢిల్లీలో ఈ మేరకు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. జేడీయూ , కాంగ్రెస్, డీఎంకే, ఎన్సీపీలు కలిసి చర్చించాయి. ఈ సమావేశం చారిత్రాత్మకమైనదని.. విపక్షాలను ఏకం చేసేందుకు తాము చరిత్రాత్మక అడుగు వేశామని రాహుల్ , నితీష్ తెలిపారు.
ఈ క్రమంలోనే ప్రతిపక్షాల పోరాటంలో బీజేపీని వ్యతిరేకించే ఆప్, టీఎంసీ, బీఆర్ఎస్ లను కలుపుకుపోవాలని నిర్ణయించారు. ఈ మూడు పార్టీలు కాంగ్రెస్ వెంట నడవడం లేవు. దీంతో ఈ పార్టీల అధినేతలతో మాట్లాడి వారిని కలిసి ఒప్పించేలా చేసే బాధ్యతను నితీష్ కు అప్పగించారు. కేసీఆర్, కేజ్రీవాల్, మమతలతో నితీష్ చర్చలు జరిపేందుకు సిద్ధమయ్యారు.
ఇప్పటికే సిబిఐ ఈడి దాడులతో ప్రతిపక్షాలన్నీ కలిసి సుప్రీంకోర్టులో పిటిషన్ వేసాయి. మోడీ సర్కార్ ను కలిసికట్టుగా ఎదిరించాయి. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల నేపథ్యంలో కూడా అన్ని పార్టీలు కలవాల్సిన బాధ్యతను ప్రతిపక్షాలు గుర్తించాయి. ఇందుకోసం బీహార్ సీఎం రంగంలోకి దించాయి. విపక్షాలన్నింటిని ఒకే గొడుకు కిందకు తెచ్చేందుకు నితీష్ ప్రయత్నాలు ఫలిస్తాయా? లేవా? అన్నది చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.