రాజకీయాలు ఎప్పుడూ ఒకేలాగా ఉండవనేందుకు ఇదే నిదర్శనం. గత కొన్నేళ్ల నుంచి అంటిముట్టనట్లుగా ఉంటున్న జేడీయూ, బీజేపీ దగ్గరవుతున్నాయి. ఇటీవలే పాట్నాలో జరిగిన ప్రకాశ్ ఉత్సవ్ లో ఒకే వేదిక మీద ప్రధాని మోదీ - బీహార్ సీఎం నితీష్ కుమార్ ఆశీనులయ్యారు. బీహార్ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్లే సీఎం నితీశ్ కుమార్ మద్యపాన నిషేధం విషయంలో ముందుకు సాగుతున్నారని ప్రధానమంత్రి మోదీ ప్రశంసల వర్షం కురిపించిన విషయం విదితమే. అయితే తాజాగా మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని బీజేపీ నేతలను సీఎం నితీష్ విందుకు ఆహ్వానించినట్లు సమాచారం. ఈ మేరకు జేడీయూ వర్గాలు అధికారికంగా ప్రకటించాయి.
ప్రతీ ఏడాది ఆర్జేడీ, జేడీయూ కలిసి సంక్రాంతి సందర్భంగా విందును ఏర్పాటు చేస్తోంది. ఇప్పటి వరకు విందుకు ప్రతిపక్ష పార్టీలను జేడీయూ ఆహ్వానించలేదు. ఈసారి బీజేపీ నేతలను విందుకు ఆహ్వానించడంతో ప్రత్యేకతను సంతరించుకుంది. జనవరి 21న జేడీయూ చేపట్టబోయే మానవహారంలో పాల్గొంటామని బీజేపీ ప్రకటించింది. సంపూర్ణ మద్యపాన నిషేధానికి మద్దతుగా సుమారు 2 కోట్ల మందికి పైగా ప్రజలతో మానవహారం చేపట్టనున్నారు. కానీ బీజేపీ నేతలు మాత్రం అలాంటిదేమీ లేదని చెబుతోంది. ఒక వేళ ఆహ్వానం వస్తే తమ పెద్దల నిర్ణయం మేరకు నడుచుకుంటామని బీహార్ బీజేపీ చీఫ్ పేర్కొన్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/