ఒక్క చిన్నపాటి నిరసన.. ఆందోళన.. హడావుడి ఏమీ లేకుండా పక్కా ప్లాన్ తో గంటల వ్యవధిలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తన పదవికి రాజీనామా చేసి.. మళ్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించటం సాధ్యమయ్యే పనేనా? అంటూ సాధ్యంకాదని నిన్నటి వరకూ చెప్పేవారు. ఎప్పుడైతే.. ప్రధాని మోడీ.. అమిత్ షా ద్వయం కలిసి వేసిన మాస్టర్ ప్లాన్ లో బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ ఎప్పుడైతే భాగస్వామ్యం అయ్యారో పరిస్థితి మొత్తం మారిపోవటమే కాదు.. అసాధ్యమైంది కాస్తా సుసాధ్యమైపోయింది.
ఏ అవినీతి ఆరోపణలతో లాలూతో ఉన్న బంధానికి తూచ్ అనేశారో.. బీజేపీతో జట్టు కట్టటం ద్వారా తేజ్వసీ యాదవ్‌చేసిన అవినీతికి మించిన అవినీతికి నితీశ్ పాల్పడ్డారన్న తీవ్ర విమర్శల్ని ఆయన మూటకట్టుకున్నారు. ఈ తరహా విమర్శలు.. ఆరోపణల్ని పక్కన పెడితే.. నితీశ్ సర్కారు తాజాగా ఎదుర్కొన్న బలపరీక్షలో విజయం సాధించారు. బీహార్ అసెంబ్లీలో తనకున్న బలాన్ని ఆయన తాజా బలపరీక్షలో ప్రదర్శించారు. మేజిక్ ఫిగర్ అయిన 122 మంది ఎమ్మెల్యేల బలానికి అదనంగా మరో తొమ్మిది మంది ఎమ్మెల్యేల బలం తనకుందన్న విషయాన్ని నితీశ్ బలపరీక్ష ద్వారా ప్రపంచానికి చాటారు.
నితీశ్‌కు అనుకూలంగా 131 మంది ఎమ్మెల్యేలు నిలవగా.. వ్యతిరేకంగా 108 ఓట్లు వచ్చాయి. బలపరీక్షలో భారీ క్రాస్ ఓటింగ్ జరిగినట్లుగా చెప్పొచ్చు. బీహార్ అసెంబ్లీలో మొత్తం 243 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. జేడీయూ.. బీజేపీ మిత్రపక్షాలకు కలిపి 129 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. తాజా బలపరీక్షలో ఉన్న బలానికి అదనంగా ఇద్దరు ఎమ్మెల్యేలు నితీశ్ కు అనుకూలంగా ఓటు వేయటం గమనార్హం. దీంతో.. క్రాస్ ఓటింగ్ జరిగిందన్న విషయం రుజువు అవుతుందని చెప్పాలి. ఇదిలా ఉండగా.. బలపరీక్షకు ముందు విపక్ష కాంగ్రెస్.. ఆర్జేడీలకు చెందిన ఎమ్మెల్యేలు ప్లకార్డులు పట్టుకొని నితీశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.