ఏడవ నిజం ఉస్మాన్ అలీ ఖాన్.. బ్రిటీష్ హయాంలో సామంత రాజుగా శతాబ్ధాలు పాలించిన కరుడుగట్టిన నియంతగా తెలంగాణ ప్రజలు పేర్కొంటారు. ఈయన భారత దేశంలో తన హైదరాబాద్ ప్రాంతాన్ని విలీనం చేయకుండా స్వతంత్ర దేశంగా లేదా పాకిస్తాన్ లో కలిపేయాలని యోచించాడు. కానీ మన భారత ఉప ప్రధాని సర్ధార్ వల్లభాయ్ పటేల్ సైనిక చర్య ద్వారా హైదరాబాద్ సంస్థానాన్ని భారత్ లో విలీనం చేశారు..
అయితే నిజాం నవాబు పాలించే సమయంలో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా కుబేరుడిగా ఉండేవాడట.. ఆయన సంపద చివరి నిమిషంలో అంతా పాకిస్తాన్ సహా విదేశాలకు తరలించుకుపోయాడని చరిత్రకారులు చెబుతుంటారు. ఈ సంపద విషయంలో ఇప్పటికీ భారత్, పాకిస్తాన్ తోపాటు నిజాం వారసులు పోరాడుతున్నారు.
నిజాం నవాబు అలా హైదరాబాద్ సంస్థానాన్ని విలీనం చేయడానికి ముందు ఇంగ్లండ్ దేశానికి రూ.307 కోట్లు తరలించాడు. ప్రస్తుతం ఆ సొమ్ము నాట్ వెస్ట్ బ్యాంకులో డిపాజిట్ గా ఉంది. ఆ డబ్బులు ఎవరికి పంచాలన్న దానిపై 70 ఏళ్ల నుంచి వివాదం నడుస్తోంది. పాకిస్తాన్ కా.? భారత్ కు చెందిన నిజాం వారసులకు చెందాలా అనే దానిపై యూకే కోర్టులో వాదనలు తాజాగా ముగిశాయి.
ఉస్మాన్ అలీఖాన్ మనవళ్లు ముఖరంఝా, ముఫఖం జాలు యూకే కోర్టులో పోరాడుతున్నారు. వీరితోపాటు మరో మనవడు నజఫ్ అలీఖాన్ కూడా హక్కుదారుడని కుటుంబ సభ్యులు ముఖరంఝా, ముఫఖం జాలకు వ్యతిరేకంగా న్యాయ పోరాటం చేస్తున్నారు.
ఈ తీర్పు కనుక భారత్ కు అనుకూలంగా వస్తే నిజాం డబ్బులు 307 కోట్లు నిజాం వారసులైన ముగ్గురు మనవళ్లు, వారి 120 మంది కుటుంబ సభ్యులు పంచుకోవాల్సి ఉంటుంది. అయితే దీనిపైన వారు కోర్టుల గడపతొక్కడంతో మరోసారి భారత్ కు కేటాయించినా వారు కోర్టుల చుట్టూ తిరిగి తేల్చుకోవాల్సి ఉంటుంది.