కాంగ్రెస్‌ కు మాయావ‌తి షాక్

Update: 2018-10-04 06:42 GMT
క‌మ‌ల‌ద‌ళంపై పోరాటంలో దేశ‌వ్యాప్తంగా విప‌క్షాల‌న్నింటినీ ఏక‌తాటిపై తీసుకొచ్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్న కాంగ్రెస్ పార్టీకి గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలింది. ఆ పార్టీతో పొత్తుకు బ‌హుజ‌న్ స‌మాజ్ పార్టీ(బీస్పీ) నిరాక‌రించింది. రాజ‌స్థాన్ - మ‌ధ్య‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల వ‌ర‌కైతే కాంగ్రెస్‌తో తాము క‌లిసే ప్ర‌స‌క్తే లేద‌ని తేల్చిచెప్పింది. ఒంట‌రిగానే బ‌రిలోకి దిగుతామ‌ని స్ప‌ష్టం చేసింది. 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో జ‌త క‌లిసే అవ‌కాశాల‌ను మాత్రం బీఎస్పీ అధినేత్రి మాయావ‌తి కొట్టిపారేయ‌లేదు.

ఉత్త‌రప్ర‌దేశ్‌ లో బీఎస్పీకి మంచి ప‌ట్టుంది. గ‌తంలో అక్క‌డ ప్ర‌భుత్వాన్ని కూడా ఏర్పాటుచేసింది. అయితే, గ‌త రెండు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మాత్రం బోల్తా కొట్టింది. స‌మాజ్‌ వాదీ పార్టీ - బీజేపీల ధాటికి విల‌విల‌లాడింది. అయినా రాష్ట్రంలో క్షేత్ర‌స్థాయిలో బీఎస్పీకి మంచి ప‌ట్టు ఉంది. ద‌ళితులు ఇప్ప‌టికీ ఆ పార్టీతోనే ఉన్నారు. ఉత్త‌ర ప్ర‌దేశ్‌ తోపాటు మ‌రికొన్ని ఉత్త‌రాది రాష్ట్రాల్లోనూ మాయావ‌తి పార్టీ త‌న ఖాతాలో వేసుకోగ‌ల‌దు. అందుకే ఆమెతో పొత్తుకు కాంగ్రెస్ త‌హ‌త‌హ‌లాడుతోంది.

రాజ‌స్థాన్ - మ‌ధ్య‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో త‌మ‌తో పొత్తుకు మాయ‌వ‌తి నిరాక‌రించ‌డం కంటే.. నిరాక‌ర‌ణ‌కు ఆమె చూపిన కార‌ణాలే కాంగ్రెస్‌ కు ఎక్కువ‌ ఆశ్చ‌ర్యం క‌లిగిస్తున్నాయి. బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించాలన్న కనీస ప్రతిఘటన కూడా హ‌స్తం పార్టీలో కనిపించడం లేదని ఆమె ఆరోపించారు. బీఎస్పీని అణిచివేయాల‌నే కాంగ్రెస్ చూస్తోంద‌న్నారు. వాస్త‌వానికి కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్‌ గాంధీ - యూపీఏ చైర్‌ పర్సన్‌ సోనియాగాంధీలు త‌మ‌తో పొత్తుకు అనుకూలంగానే ఉన్నార‌ని.. దిగ్విజయ్‌ సింగ్‌ వంటి నేతలు మాత్రం త‌మ‌తో కూట‌మిని కోరుకోవ‌డం లేద‌ని తెలిపారు. బీజేపీ ఏజెంట్‌ గా దిగ్విజ‌య్‌ ని ఆరోపించారు. తాను ఎన్‌ ఫోర్స్‌ మెంట్ డైరెక్ట‌రేట్‌ - సీబీఐ కేసుల ఒత్త‌డిలో ఉన్న‌ట్లు ఆయ‌న దుష్ప్ర‌చారం చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. ఇక ప్ర‌ధాని మోదీని ఎదుర్కొ నేందుకు కాంగ్రెస్‌ చిత్తశుద్ధితో లేదని మాయావ‌తి ఆరోపించారు.


Tags:    

Similar News