దేశంలో కుప్పలు తెప్పలుగా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకులను కలిపి అతిపెద్ద బ్యాంకులుగా కేంద్రంలోని మోడీ సర్కారు తీర్చిదిద్దుతోంది. ఇప్పటికే ఎస్.బీ.ఐ అనుబంధ బ్యాంకులను విలీనం చేసి దేశంలోనే నంబర్ 1 బ్యాంకుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను తీర్చిదిద్దింది.
ఆ కోవలోనే దశాబ్ధాల చరిత్ర ఉన్న తెలుగు వాళ్ల సెంటిమెంట్ బ్యాంకు ఆంధ్రాబ్యాంకు కూడా కనుమరుగు కాబోతోంది. ఏప్రిల్ 1 నుంచి బ్యాంకుల విలీనం పూర్తవుతుంది. ఆర్బీఐ ఆమోదం పొండంతో ఇక ఏప్రిల్ 1 నుంచి ఆంధ్రా బ్యాంకు సహా పలు బ్యాంకులు కనుమరుగై వేరే బ్యాంకుల్లో విలీనం కాబోతున్నాయి.
*పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలు విలీనమై దేశంలోనే రెండో అతిపెద్ద బ్యాంకుగా పంజాబ్ నేషనల్ బ్యాంకు అవతరించనుంది.
*ఇక సిండికేట్ బ్యాంకు ఏప్రిల్ 1 కెనరా బ్యాంకులో విలీనమవుతుంది. కెనరా బ్యాంకు పటిష్టమవుతుంది.
*యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియాలో ఏకంగా ఆంధ్రా బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకులు విలీనం అవుతాయి. యూనియర్ బ్యాంకు ఆఫ్ ఇండియాగా అవతరిస్తుంది
*అలహాబాద్ బ్యాంకు తాజాగా ఇండియన్ బ్యాంకులో విలీనం అవుతుంది. ఇండియన్ బ్యాంకుగా పనిచేస్తుంది.
ఈ భారీ బ్యాంకుల విలీనంతో దేశంలో 7 పెద్ద బ్యాంకులు, 5 చిన్న బ్యాంకులు మాత్రమే మిగులుతాయి. 2017లో 27 బ్యాంకులున్న దేశంలో ఇప్పుడు విలీనం తర్వాత కేవలం 12 బ్యాంకులు మాత్రమే ఉండనున్నాయి.