బ‌గ్ లేదు కానీ అభినంద‌న్ బాడీలో దాన్ని గుర్తించారు

Update: 2019-03-03 18:25 GMT
పాక్ చేతికి చిక్కి.. క్షేమంగా తిరిగి వ‌చ్చిన అభినంద‌న్ కు ప్ర‌స్తుతం పెద్ద ఎత్తున వైద్య ప‌రీక్ష‌లు జ‌రుగుతున్నాయి. పాక్ నుంచి భార‌త్ కు వ‌చ్చిన క్ష‌ణం నుంచి ఆయ‌న్ను భార‌త వైమానిక ద‌ళం అధీనంలోనే ఉంటున్నారు. ఆయ‌న‌కు ప‌లు ప‌రీక్ష‌ల్ని నిర్వ‌హిస్తున్నారు. శ‌త్రుదేశానికి చిక్కి తిరిగి వ‌చ్చిన త‌ర్వాత నిర్వ‌హించే ప‌రీక్ష‌ల్నేఅభినంద‌న్ కు చేస్తున్నారు.

ఇప్ప‌టివ‌ర‌కూ నిర్వ‌హించిన ప‌రీక్ష‌ల్లో  అభినంద‌న్ శ‌రీరంలో ఎలాంటి స్పై బ‌గ్ లేద‌న్న విష‌యాన్ని నిర్దారించారు. దీనికి సంబంధించిన స‌మాచారాన్ని ఆర్మీ వైద్యుడు ఒక‌రు వెల్ల‌డించిన‌ట్లుగా తెలుస్తోంది. అయితే.. అభినంద‌న్ శ‌రీరంలో రెండు గాయాల్ని ఎంఆర్ ఐ స్కాన్ లో గుర్తించిన‌ట్లుగా తెలుస్తోంది. ఇందులో ఒక‌టి వెన్నుముక కు త‌గిలిన గాయంగా చెబుతున్నారు.

యుద్ధ విమానం నుంచి ప్యారాచూట్ లో బ‌య‌ట‌కు వ‌చ్చిన వేళ‌..కింద‌కు దిగే సంద‌ర్భంలో వెన్నుముక‌కు చిన్న గాయాన్ని గుర్తించారు. ఇక‌.. పాక్ ఆక్ర‌మిత క‌శ్మీర్ లో ఆయ‌న దిగిన త‌ర్వాత అక్క‌డి స్థానికులు అభినంద‌న్ పై దాడి చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ దాడిలో ప‌క్క‌టెముకుల వ‌ద్ద గాయమైన‌ట్లు  గుర్తించారు. వెన్నుముక‌కు త‌గిలిన గాయం కార‌ణంగా ఆయ‌నకు మ‌రిన్ని ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్నారు.

త్వ‌ర‌లో బెంగ‌ళూరులోని ఐఏఎంలో ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తారు. వెన్నుముక‌కు త‌గిలిన గాయం కార‌ణంగా యుద్ధ విమానాన్ని ఆయ‌న న‌డ‌ప‌గ‌ల‌రా?  లేదా?  అన్న‌ది ఈ ప‌రీక్ష‌లో తేలుస్తారు. కార్గిల్ యుద్ధ స‌మ‌యంలో పాక్ లో దిగిన ఫైట‌ర్ పైలెట్ న‌చికేత‌కు ఇదే త‌ర‌హా ప‌రీక్ష నిర్వ‌హించ‌టం.. నెగిటివ్ రిజ‌ల్ట్ రావ‌టంతో ఆయ‌న్ను అప్ప‌ట్లో ఫైట‌ర్ జెట్ విధుల నుంచి త‌ప్పించారు. మ‌రి.. ఈ ప‌రీక్ష‌లో అభినంద‌న్ రిజ‌ల్ట్ ఎలా రానుంద‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.
Tags:    

Similar News